Advertisement
Google Ads BL

పాయల్ పాపకి భారీ సినిమాలో బంపర్ ఆఫర్


‘ఆర్ఎక్స్ 100’ అంటూ మంచి హిట్ కొట్టిన పాయల్ రాజపుత్‌కి మళ్ళీ అలాంటి సినిమా కానీ, అలాంటి హిట్ కానీ తగల్లేదు. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత అందాల ఆరబోతకు ఇంపార్టెన్స్ ఇస్తూ నటనను పక్కనబెట్టేసింది. ఆఖరికి సీనియర్ హీరో వెంకటేష్ కూడా పాయల్ కెరీర్‌ని కాపాడలేకపోయాడు. సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా నిలవాల్సిన పాయల్ రాజపుత్ ఇప్పటికీ గ్లామర్ గ్లామర్ అంటూ హాట్ ఫోటో షూట్స్‌ని నమ్ముకుంటుంది తప్ప.. పెరఫార్మెన్సు‌కి చోటివ్వడం లేదు. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత సరైన అవగాహన లేకుండా గ్లామర్ చూపించే పాత్రలకే సై అన్నది. కానీ అవేమి పాయల్‌ని బిజీ చేయలేకపోయాయి. అయితే రీసెంట్‌గా పాయల్ రాజ్‌పుత్‌కి భారీ బడ్జెట్ మూవీలో సీనియర్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేసే అవకాశం వచ్చినట్లుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement
CJ Advs

 

బాలకృష్ణ - బోయపాటి కాంబోలో తెరకెక్కుతోన్న ‘బీబీ3’ లో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఆ సినిమాలో ఐటెం సాంగ్ కోసం హీరోయిన్స్ వెతుకులాటలో బోయపాటికి పాయల్ రాజ్‌పుత్ తగిలింది అని.. ఆ సాంగ్‌లో గ్లామర్‌గా పాయల్ కాలు కదిపితే సాంగ్‌కి క్రేజ్ వస్తుంది అని బోయపాటి అనుకుంటున్నాడట. బాలయ్యకి హీరోయిన్స్‌ని సెట్ చెయ్యడంలో ఇబ్బందులు పడిన బోయపాటికి, పాయల్ అయితే బీబీ3 ఐటెం సాంగ్‌కి పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది అని దాదాపుగా ఆమెనే ఫిక్స్ అయ్యాడనే టాక్ వినిపిస్తుంది. మరి ఇదే నిజమైతే బెల్లంకొండ శ్రీనివాస్ సీత సినిమాలో బుల్లెట్టు మీదొచ్చే.. అన్నట్టుగా..  పాయల్ పాప బాలయ్య సరసన మాస్ స్టెప్స్ తో ఉర్రూతలూగించడం ఖాయం అంటున్నారు నందమూరి అభిమానులు.

Payal Rajput got Bumper Offer in Tollywood Crazy Project:

Payal Rajput Item song in BB3 Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs