Advertisement
Google Ads BL

మీడియా పర్సన్ కి వేడిగా రిప్లై.!


ప్రముఖ బాలీవుడ్ సినీ విమర్శకుడు తరుణ్ ఆదర్శ్ సినిమాల గురించి రెగ్యులర్ గా ట్వీట్స్ చెయ్యడం కామనే. ఈ రోజు ఫిబ్రవరి 14 న తన ట్విట్టర్ అకౌంట్ నుండి రాబోయే రోజులన్నీ సౌత్ ఇండియా రూల్ చేయబోతుంది. షార్ట్ గ్యాప్ లో మెనీ పాన్ ఇండియా ఫిలిమ్స్ రాబోతున్నాయి అని డేట్స్ తో సహా ఆయన తన ట్విట్టర్ అకౌంట్ నుండి ట్వీట్ చేసాడు. అందులో అడవి శేష్ మేజర్ తో జులై 2 న, యశ్ కెజిఎఫ్ జులై 16 న, ప్రభాస్ రాధేశ్యామ్ జులై 30, అల్లు అర్జున్ పుష్ప ఆగష్టు 13 న, విజయ్ దేవరకొండ లైగర్ సెప్టెంబర్ 9 న,  అక్టోబర్ 13 న రాజమౌళి RRR అంటూ సౌత్ నుండి వరసగా కొద్దిపాటి గ్యాప్ లోనే పాన్ ఇండియా ఫిలిమ్స్ రాబోతున్నాయి అంటూ ట్వీట్ చేసాడు. నిజానికి ఇది మనకు గర్వకారణమే.

Advertisement
CJ Advs

కానీ మన తెలుగు సినిమాలకు సంబందించిన మీడియా పర్సన్.. తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేసిన పాన్ ఇండియా ఫిలిమ్స్ లిస్ట్ లోకి అడవి శేష్ మేజర్ ఎందుకు వచ్చింది. మేజర్ అనే సినిమా గురించి ఎంతమందికి తెలుసు. ఎవరికీ తెలుసు. అది పాన్ ఇండియా ఫిలిం ఏమిటి.. మేజర్ సినిమాని పట్టించుకునేవారు ఎవరు అన్న రేంజ్ లో ఓ ట్వీట్ చేసారు. యూసువల్ గా అయితే అప్పటికే ఆ ట్వీట్ కి రెస్పాండ్ అయిన వారే ఇది కరెక్ట్ కాదు అని చెప్తూ ఉన్నారు. అంతలోనే ఆ మీడియా పర్సన్ చేసిన ట్వీట్ కి డైరెక్ట్ గా అడవి శేషే రియాక్ట్ అవడం విశేషం. అదే ట్వీట్ ని కోట్ చేస్తూ సర్ ఇది నేను గుర్తు పెట్టుకుంటాను. మీరు ఆ డేట్ గుర్తు పెట్టుకోండి. మాములుగా అయితే నా ఫ్రెండ్ చెప్పాడు. ఇలాంటి వాటికీ రెస్పాండ్ అవ్వొద్దు అని.. కానీ రియాక్ట్ అవుతున్నాను. ఆ డేట్ గుర్తుపెట్టుకోండి.. తర్వాత మాట్లాడుకుందాం అంటూ ట్వీట్ చేసాడు అడవి శేష్.

సో ఇప్పటికే క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలతో తనకంటూ ఓ స్పెషల్ ఓ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న అడవి శేష్ పర్టిక్యులర్ సెక్టార్ ఆడియన్స్ ని గైన్ చేసుకున్న అడవి శేష్ మేజర్ విషయంలో ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అంటే.. మేజర్ అవుట్ ఫుట్ ఎలా వస్తుందో మనం అర్ధం చేసుకోవచ్చు. అండ్ ఈ సినిమాకి సూపర్ స్టార్ మహేష్ నిర్మాత కావడం విశేషం. శేష్ ఇంత వాడిగా వేడిగా రిప్లై ఇచ్చాడంటే రిజల్ట్ కూడా అదే రేంజ్ లో రప్పించి విమర్శకుల నోళ్లు మూయిస్తాడేమో..!

Hot reply to media person!:

<pre id="tw-target-text" class="tw-data-text tw-text-large XcVN5d tw-ta" dir="ltr"><span lang="en">Media person who insulted Adavi Shesh Major</span></pre>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs