ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఊపుకి రామ్ రెడ్ బ్రేకులు వేసింది. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత రామ్ ఎంతో అలోచించి రెడ్ మూవీలో డ్యూయెల్ రోల్ చేసాడు. కరోనా లాక్ డౌన్ కి ముందే విడుదల కావల్సిన రెడ్ మూవీ ఈ సంక్రాంతికి విడుదలైంది. మధ్యలో ఓటిటి ఆఫర్స్ ని రామ్ అస్సలు లెక్క చెయ్యలేదు. తన సినిమా థియేటర్స్ లోనే విడుదల చేస్తా అన్నట్టుగా రెడ్ ని సంక్రాంతికి విడుదల చేసాడు. కానీ రామ్ రెడ్ కి మిక్స్డ్ టాక్ రావడంతో.. రామ్ కాస్త డల్ అయ్యాడు. అప్పటి నుండి రామ్ నెక్స్ట్ సినిమాపై అందరిలో ఆశక్తి నెలకొంది. ఎలాంటి దర్శకుడితో, రామ్ ఎలాంటి అంటే మాస్ లేదా లవర్ బాయ్ మాదిరి సినిమా ఒప్పుకుంటాడా.. అని ఎదురు చూస్తున్నారు. కానీ రామ్ మధ్యలో కథలు వింటున్నట్టుగా ఎక్కడా న్యూస్ లేదు. అంటే రెడ్ తో రామ్ కాస్త గ్యాప్ తీసుకుని రిలాక్స్ అవుతున్నాడేమో అనుకుంటున్నారు.
అయితే రీసెంట్ గా రామ్ తాన్ నెక్స్ట్ సినిమా త్వరలోనే ఎనౌన్స్ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా తమిళ దర్శకుడు లింగు స్వామితో రామ్ తన నెక్స్ట్ సినిమాని ప్రకటించబోతున్నట్టుగా సమాచారం. దాదాపుగా రామ్ - లింగు స్వామి కాంబో ఫిక్స్ అయ్యిపోయింది అని ఆ సినిమా యు టర్న్ నిర్మాతలు శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మించబోతున్నట్లుగా సమాచారం. మరి రామ్ - లింగు స్వామి బ్యాగ్ డ్రాప్ ఎలా ఉండబోతుంది.. మాస్ లేదా లవ్ స్టోరీ నా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు.