Advertisement
Google Ads BL

రెండో నెల.. రెండక్షరాలు.. రెండోసారి.!


అందరూ సంక్రాతి సీజన్ పైన సమ్మర్ సీజన్ పైన కన్నేస్తే.. నితిన్ మాత్రం హ్యాపీగా సంక్రాంతికి సమ్మర్ కి మధ్యన వచ్చి సక్సెస్ లు కొడుతున్నాడు. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 21 న వెంకీ కుడుములు దర్శకత్వంలో చేసిన భీష్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన హిట్ కొట్టాడు. సడన్ గా కరోనా వచ్చి పడింది కానీ.. భీష్మ కి ఇంకా థియేట్రికల్ రన్ ఉండేది. బట్ ఇప్పటికి భీష్మ సినిమా సూపర్ హిట్టే. మళ్ళీ అదే ఫిబ్రవరి నెలలో 26 న చెక్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ - రకుల్ ప్రీత్ - ప్రియా ప్రకాష్ వారియర్స్ కలయికలో తెరకెక్కిన చెక్ మూవీ ఈ నెల 26 న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. 

Advertisement
CJ Advs

గత ఏడాది ఫిబ్రవరిలో భీష్మ హిట్టు. మరి ఈ ఏడాది ఫిబ్రవరిలో చెక్. రెండో నెల రెండోసారి.. విశేషం ఏమిటి అంటే.. రెండక్షరాల టైటిల్స్ రెండూ కూడా. అంటే గత ఏడాది భీష్మ రెండక్షరాల టైటిల్ తో హిట్ కొట్టిన నితిన్ ఈసారి రెండక్షరాల చెక్ తోనూ నితిన్ హిట్ కొట్టేసేలానే కనబడుతున్నాడు. అన్నట్టు హీరోగా నితిన్ లాంచింగ్ ఫిలిం జయం దగ్గరనుండి తన బిగ్గెస్ట్ హిట్స్.. దిల్, ఇష్క్, అ..ఆ కూడా రెండక్షరాల మూవీస్ కావడం విశేషం. మరి చెక్ మూవీ ఇప్పటివరకు కాస్త డల్ గా ఉన్నా.. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరు పెంచింది. అలాగే నితిన్ కూడా రామేశ్వరం వెళ్లి అక్కడ శివ సన్నిధిలో హోమం చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Second month, Two letters, Second time.!:

Nithin Check Movie to be released Feb 19th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs