Advertisement
Google Ads BL

జబర్దస్త్ స్టేజ్ పై లవ్ ప్రపోజల్


జబర్దస్త్ మొదలైన తర్వాత అనసూయ యాంకర్ గా రాజ్యమేలింది. తర్వాత సడన్ గా అనసూయ ప్లేస్ లోకి రష్మీ ఎంట్రీ ఇచ్చింది. మళ్ళీ అనసూయ కోసం జబర్దస్త్, రష్మీ కోసం ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ రెండు షో లుగా జబర్దస్ ని మార్చేశారు మల్లెమాల వాళ్ళు. అనసూయ జబర్దస్త్ యాంకర్ గా అదరగొట్టేస్తుంటే.. ఎక్స్ట్రా జబర్దస్త్ లో రష్మీ గౌతమ్ తన గ్లామర్ హొయలు చూపిస్తుంది. ఇక ఎక్స్ట్రా జబర్దస్త్ లో రష్మీ - సుధీర్ మధ్య మధ్యన సం థింగ్ సం థింగ్ అంటూ బుల్లితెర ప్రేక్షకులను డైవర్ట్ చేసి రష్మీ - సుధీర్ ల మధ్యన ప్రేమ ఉన్నట్టుగా కలరింగ్ ఇస్తూ టీఆర్పీ పెంచుకుంటున్నారు. ఢీ షో లోను అవకాశం ఉన్నప్పుడల్లా రష్మీ - సుధీర్ ప్రేమనే హైలెట్ చేస్తున్నారు. కానీ మా మధ్యన ఫ్రెండ్ షిప్ తప్ప మరొకటి లేదంటూ రష్మీ - సుదీర్లు కుండబద్దలు కొట్టిన సందర్భాలూ కోకొల్లలు.

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు మరో ప్రేమ జంటని క్రియేట్ చేసి బాగా వాడేస్తున్నారు. అదే ఇమ్మాన్యువల్ - వర్ష. ఇమ్మాన్యువల్ కలర్ పరంగా బ్లాక్ అయినా పెరఫార్మెన్స్ లో అదుర్స్ అన్న రేంజ్ లో ఉంటుంది అతని నటన. ఇక సీరియల్ ఆర్టిస్ట్ వర్ష జబర్దస్ కీ ఎంట్రీ ఇచ్చినప్పటినుండి ఇమ్మాన్యువల్ - వర్ష మధ్యలో సం థింగ్ సం థింగ్ అంటూ కలరింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసారు. ఇమ్మాన్యువల్ కూడా వర్ష ని రాసుకుని పూసుకుని తిరగడం.. కలర్ కాదు, మనసు ముఖ్యం అంటూ వర్ష డైలాగ్స్ తో వాళ్ళ మధ్యన ప్రేమ అనే మాట తెరపైకి వచ్చింది. మధ్యలో రోజా గారు ఇమ్మాన్యువల్ ని ఎంకరేజ్ చెయ్యడం అబ్బో చాలానే జరుగుతున్నాయి జబర్దస్ లో. తాజాగా  గత శుక్రవారం ఇమ్మాన్యువల్.. నా పక్కన అంటే నా కలర్ చూసి ఎవరూ నా పక్కన నించోరు. కానీ ఫస్ట్ నా పక్కన నుంచున్న అమ్మాయి వర్ష. వర్ష లాస్ట్ కావాలంటూ వర్షకి హ్యాపీ వాలంటైన్స్ డే చెప్పడం, ఓ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చెయ్యడం.. దానికి వర్ష నవ్వుకోవడం.. రోజమ్మ ఎంకరేజ్ చెయ్యడం అబ్బో..  జబర్దస్ స్టేజ్ మీద మాములుగా లేదు ఈ కొత్త ప్రేమ కథ యవ్వారం.

Love Proposal on Jabardasth Stage:

Emmanuel proposing his love to Varsha
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs