ప్రతి రోజు పండగే తో మంచి హిట్ కొట్టిన మారుతి సరైన హీరో దొరకక కొన్నాళ్ళు, కరోనా ఎఫెక్ట్ తో ఇంకొన్నాళ్ళు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే కొంత ఇండస్ట్రీ ఇచ్చిన గ్యాప్ అయితే కొంత కరోనా తో వచ్చిన గ్యాప్. టోటల్ గా చాలా గ్యాప్ వచ్చేసింది దర్శకుడు మారుతికి. అయితే ఈ గ్యాప్ ని మాత్రం మిస్ యూస్ చెయ్యలేదు మారుతి. పక్కా కమర్షియల్ కథలన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాడు. అందులో నుంచి ఏరికోరి మరీ ఎంచుకుని ఓ ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ తో పక్కా కమర్షియల్ అనే టైటిల్ తోనే రాబోతున్నాడు. ఈ కథలో పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు స్టోరీలో ఓ నావెల్ పాయింట్ కూడా ఉంది కాబట్టే హీరో గోపీచంద్ కూడా వేరే కమిట్మెంట్స్ ఉన్నప్పటికీ.. సింగల్ సిట్టింగ్ లో మారుతీ కథకి ఓకె చెప్పాడు.
ఒకప్పుడు గోపీచంద్ లక్ష్యం, లౌక్యం వంటి సినిమాలలో ఎంటర్టైన్మెంట్ ని బాగానే పండించి తనలోని కామెడీ యాంగిల్ ని చూపించాడు. కానీ గోపీచంద్ యాక్షన్ మోడీ లోకి వెళ్లిన తర్వాత మాత్రం సక్సెస్ కి దూరమయ్యాడు. శౌర్యం, పంతం, జిల్, ఆక్సీజెన్, గౌతమ్ నందా, చాణక్య లాంటి యాక్షన్ మూవీస్ తో ప్లాప్ లు మూటగట్టుకున్నాడు. యాక్షన్ జోనర్ లో ట్రై చేసిన మూవీస్ గోపీచంద్ కి వర్కౌట్ కాలేదు. బట్ తాను ఎంటర్టైన్ చెయ్యగలను అని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న హీరో కాబట్టి.. మారుతీ - గోపీచంద్ కాంబినేషన్ బాగా వర్కౌట్ అవుతుంది అని ఎక్సపెక్ట్ చెయ్యొచ్చు. మరి రేపు ఆదివారం ఉదయం 8.30నిమిషాలకి మారుతీ - గోపీచంద్ సినిమా ఓపెనింగ్ తో పాటుగా టైటిల్ అనౌన్సమెంట్ కూడా రాబోతుంది.