RRR రిలీజ్ డేట్ విషయంలో బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ కి RRR డైరెక్టర్ రాజమౌళి మధ్యన వివాదం చిలికి చిలికి గాలివానలా మారిపోయింది. RRR రిలీజ్ డేట్ అక్టోబర్ 13 అని రాజమౌళి అండ్ RRR టీం ఎప్పుడైతే ఎనౌన్స్ చేసిందో అప్పటినుండి రాజమౌళి మీద ఇంతెత్తున లేస్తున్నాడు మైదాన్ నిర్మాత బోనీ కపూర్. అజయ్ దేవగణ్ హీరోగా బోని నిర్మించిన మైదాన్ రిలీజ్ డేట్ కూడా అక్టోబర్ 15 నే అని మైదాన్ టీం ఎప్పుడో ప్రకటించినప్పటికీ నిర్దాక్షిణ్యంగా ఎథిక్స్ లేకుండా అక్టోబర్ 13 న RRR అని ఎలా ఇస్తారు. అసలు రాజమౌళి అలా ఇలా.. సీనియర్ యాక్టర్స్ ని గౌరవించనివాడు పాన్ ఇండియా డైరెక్టర్ అయితే ఏంటి ఇలా రాజమౌళి మీద అవకాశం వచ్చినప్పుడల్లా అక్కసు వెళ్లగక్కుతున్నారు.
శ్రీదేవిని రాజమౌళి అవమానించాడని, ఇప్పుడు RRR రిలీజ్ డేట్ విషయంలో తమని ఇబ్బంది పెడుతున్నాడంటూ రీసెంట్ గా మాట్లాడిన బోని కపూర్ మరోసారి జక్కన్న పై హాట్ కామెంట్స్ చేసాడు. RRR రిలీజ్ డేట్ విషయంగా నేనూ రాజమౌళితో ఫోన్ లో మాట్లాడా అని.. అయితే RRR రిలీజ్ డేట్ క్లి తనకి సంబంధం లేదని, నిర్మాతలు ఇష్టప్రకారమే డేట్ ప్రకటించారంటూ తప్పు నిర్మాతలపై నెట్టేసాడని.. కానీ రాజమౌళికి తెలియకుండా ఏది జరగదని తనకు తెలుసు అని.. అయితే RRR లో కీలక పాత్రలో నటిస్తున్న అజయ్ దేవగన్ కి RRR రిలీజ్ డేట్ విషయం తెలిసి ఉండకపోవచ్చని.. సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్, మంచి డైరెక్టర్ అని పేరున్న రాజమౌళి నుండి ఇలాంటి చర్యలు ఊహించలేదంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు బోని కపూర్.