డెబ్యూస్ హీరోలందరితో మెగా హీరోనే టాప్
సినిమా ఫ్యామిలీస్ నుండి ఇప్పటివరకు చాలామంది వారసులు వేడితెరకు ఎంట్రీ ఇచ్చారు. ఒక్క మెగా ఫ్యామిలీ నుండే చాలామంది హీరోలు వెండితెరకు అరంగేట్రం చేసారు. మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటివరకు రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, శిరీష్, సాయి ధరమ్ తేజ్, చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్.. రీసెంట్ గా ఉప్పెన తో వైష్ణవ తేజ్ తెరకు హీరోలుగా గ్రాండ్ గానే ఎంట్రీ ఇచ్చారు. ఇక నాగ్ ఫ్యామిలీ నుండి సుమంత్, సుశాంత్, నాగ చైతన్య, అఖిల్ వంటి హీరోలు ఉండగా.. వెంకటేష్ కి వారసుడిగా రానా ఉన్నాడు. నందమూరి ఫ్యామిలీ నుండి ఎన్టీఆర్ వారసుడిగా బాలయ్య ఉంటే.. తర్వాత తరంలో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, తారకరత్నలు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోల కొడుకులు ఫస్ట్ మూవీ, ఫస్ట్ డే ఎంత కలెక్షన్స్ కొల్లగొట్టారు. ఎవరెవరు ఏయే స్థానాల్లో ఉన్నారో చూద్దాం. అందరిలో రీసెంట్ గా ఉప్పెన తో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ తేజ్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు.
హీరో - మూవీ - ఫస్ట్ డే కలెక్షన్స్
వైష్ణవ తేజ్ - ఉప్పెన - 9.35
అఖిల్ - అఖిల్ - 7.6
రామ్ చరణ్ - చిరుత - 3.75
వరుణ్ తేజ్ - ముకుంద - 3.35
బెల్లంకొండ - అల్లుడుశీను - 2.86
నాగ చైతన్య - జోష్ - 2.6
సాయి తేజ్ - పిల్ల నువ్వు లేని జీవితం - 2.3