బాలకృష్ణకి గత కొన్నేళ్లుగా హిట్ లేకపోయినా.. ప్రస్తుతం బోయపాటి తో చేస్తున్న BB3 పై భారీ అంచనాలే ఉన్నాయి. బోయపాటి - బాలయ్య కాంబోలో గతంలో తెరకెక్కిన సింహ, లెజెండ్ వంటి భారీ హిట్స్ ఉండడంతో ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న BB3 కూడా హిట్ అని నందమూరి ఫాన్స్ ఫిక్స్ అయ్యారు. అయితే బోయపాటి బాలయ్యని ఈ సినిమాలో ఎంత పవర్ ఫుల్ గా చూపించబోతున్నాడు అనేది BB3 ఫస్ట్ టీజర్ తోనే రివీల్ చేసేసాడు. అలాగే రిలీజ్ డేట్ పోస్టర్ లోను బాలయ్య స్టైలిష్ లుక్ బాగా ఆకట్టుకుంటుంది. మరి బాలయ్యకి అదొక్కటే తలనొప్పి అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే.. BB3 అని మూవీ అనౌన్సమెంట్ వచ్చినప్పటి నుండి బాలకృష్ణ కి హీరోయిన్ కష్టాలు మొదలయ్యాయి.
సీనియర్ హీరో అవడం అనుష్క, త్రిష లాంటి వాళ్ళు సైడ్ అవడం, నయనతార తమిళ్ లో బిజీగా ఉండడంతో బాలయ్యకి హీరోయిన్ కష్టాలు మొదలయ్యాయి. BB3 అన్నప్పటినుండి బోయపాటి బాలయ్య కోసం హీరోయిన్స్ ని ఎంపిక చెయ్యడం.. వారు రిజెక్ట్ చెయ్యడం.. చివరికి ఫేమ్ లేని పూర్ణ, బక్క చిక్కినట్టు ఉండే ప్రగ్య జైస్వాల్ లు తగిలారు. అదీ ఓకె. ఇప్పుడు బాలయ్య - బోయపాటి మూవీలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. దాని కోసం ఓ స్టార్ హీరోయిన్ కోసం బోయపాటి చెయ్యని ప్రయత్నాలే లేవట. హీరోయిన్స్ విషయంలో సర్దుకుపోయినా.. ఐటెమ్ సాంగ్ కోసం ఖచ్చితంగా స్టార్ హీరోయిన్ కోసం బోయపాటి చూస్తున్నాడట. కానీ బాలయ్య సినిమా అనగానే హీరోయిన్స్ రిజెక్ట్ చేస్తున్నారట. మరి ఇలా చూసుకుంటే బాలయ్యకి ఫ్యూచర్ లోను హీరోయిన్స్ ప్రోబ్లెంస్ మాములుగా ఉండేలా కనిపించడం లేదు.