Advertisement
Google Ads BL

గురూజీ గురి మళ్లీ మనీ పైనే


త్రివిక్రమ్ శ్రీనివాస్: ఆయన రైటర్ గా ఉన్నప్పుడు కథలన్నీ కామన్ మ్యాన్ చుట్టూ తిరిగేవి. మధ్యతరగతి జీవితాలను చూపించేవి. మన అనిపించే మనుషులని మనకి పరిచయం చేసేవి. మనకు అనుగుణంగానే మాటలు అన్ని ఉండేవి. ఒక్కసారి ఆయనెప్పుడయితే స్టార్ డైరెక్టర్ అయ్యారో.. అప్పటినుండి అనూహ్యంగా అవన్ని అందలం ఎక్కేశాయి. ఒకసారి దర్శకుడిగా ఆయన సినిమాల ప్రస్థానం చూసుకుంటే.. నువ్వే నువ్వే స్టార్ట్ చేసిన త్రివిక్రమ్ ఆ సినిమాతో సరైన సక్సెస్ దొరక్కపోయే సరికి అతడు కథలోకి వెళ్లారు.. ఓ కమర్షియల్ ఫిలిం చెయ్యడానికి. అతడు మోటివ్ డబ్బు. ఇంత డబ్బు తీసుకోవడం మర్డర్ చెయ్యడం. హీరో ది ఓ కాంట్రాక్టు కిల్లర్ కేరెక్టర్. అతడు అనేది మని కోసం మర్డర్లు చేసే కాంట్రాక్టు కిల్లర్ కేరెక్టర్. అతడు తర్వాత జల్సా చేసారు. జల్సా వరకు ఆయన తన పరిమితులకు కట్టుపడ్డా.. జులాయి అంటూ ఓ 1500 కోట్ల సబ్జెక్టు పట్టుకుని వచ్చారు. అలాగే వేల కోట్ల ఖనిజం కోసం ఓ గ్రామాన్నే లేకుండా చేద్దామనుకున్న విలన్ కి మహేష్ ఖలేజా చూపించాల్సి వచ్చింది. ఆ కథకీ ఇంధనం ధనమే. 

Advertisement
CJ Advs

ఆ రకంగానే అత్తారింటికి దారేది. కొన్ని వేల కోట్లు అంటూ ఫ్యాక్టరీలు, కొన్ని వేల కోట్లు అంటూ రిచ్ సెటప్ దింపారు. అక్కడితో ఆగరా అంటే.. మళ్ళీ సన్నాఫ్ సత్యమూర్తి. తండ్రి చనిపోతే కొన్ని వందల కోట్లు వదులుకోవడం, మళ్ళీ డబ్బు సంపాదించడం ఇలా డబ్బు చుట్టూనే తిరిగే కథలు. సరే నితిన్, సమంత ని పెట్టి ఓ మిడిల్ క్లాస్ సినిమా చేస్తారా అంటే అది కూడా డబ్బుతో ముడిపడిన కథే. తనకి సరైన సమయానికి డబ్బు ఇవ్వలేదని కక్ష గట్టే అత్త కేరెక్టర్ అ...ఆ, అక్కడా డబ్బే. ఇక త్రివిక్రమ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ అలా వైకుంఠపురములో కూడా.. ఓ డబ్బున్న వాళ్ళింట్లో పెరగాల్సిన కుర్రాడు పేదింట్లో పెరిగాడు.. అంటూ ఆ డబ్బు చుట్టూ కథని తిప్పుతూనే ఫైనల్ గా హీరోని హెలికాఫ్టర్ ఎక్కించే వరకు వదల్లేదు. 

అజ్ఞాతవాసి అయితే చెప్పక్కర్లేదు. సో అన్నీ రిచ్ సెటప్ లే. డబ్బు డబ్బు డబ్బూ.  మొన్నీమధ్యన వచ్చిన అరవింద సమేత తప్ప. అరవింద సమేతలో మాత్రం కాస్త రాయలసీమ మట్టి వాసన చూపించారు. అయితే పర్లేదు గురూజీ గాలి మళ్లారు. మంచి కథల వైపు వెళుతున్నారు అనుకుంటే..ఇప్పుడు తారక్ తో చెయ్యబోయే సినిమా మళ్ళీ రిచ్ సెటప్ లోనే అనే టాక్ వినిపిస్తుంది. రూటు మార్చండి గురూజీ. మనీని కాస్త పక్కనబెట్టి మనుషుల్ని, మనస్తత్వాలని, వ్యక్తిత్వాలని పట్టించుకోండి.

Trivikram Getting Repetitive!:

<span>It&rsquo;s high time that Trivikram keeps aside money matter and come up with stories that connect to common man and&nbsp;</span>have human touch
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs