నిన్నటికి నిన్న తెలంగాణాలో కొత్త పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నట్లుగా ఆ పార్టీ కోసం ఇప్పటి నుండే సభలు సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా హడావిడి చేసిన షర్మిల సినిమా ఇండస్ట్రీపై కూడా శ్రద్ద చూపించడం విశేషం. అటు పొలిటికల్ గా కార్యకర్తల నుండి సమాచారం తెలుసుకుంటూనే రేపు ఈ కథలో పాత్రలు కల్పితం అనే సినిమా సెకండ్ సాంగ్ లాంచ్ చేయబోతుంది.
ఇకమీదట ఇలాగె పరిచయస్తులు, సన్నిహితులు, స్నేహితుల ద్వారానో సినిమా వాళ్ళు కూడా షర్మిలను అప్రోచ్ అవ్వొచ్చు. ఇప్పటికే టీవీ యాంకర్ శ్యామల తన భర్తతో పాటుగా షర్మిలని కలిశారు. ఇక మీదట సినిమా సెలబ్రిటీస్ ఎంతమంది షర్మిలను కలిసే ప్రోగ్రామ్స్ ఉంటాయో కానీ.. ఇక మీదుట షర్మిల చేతుల మీదుగా మరికొన్ని సినిమాల టీజర్స్ కానీ, ట్రైలర్స్ కానీ రిలీజ్ చేయించవచ్చు. లేదూ.. సినిమా ఈవెంట్స్ కి షర్మిలకు ఆహ్వానాలు అందవచ్చు. ఇది చూస్తుంటే సినిమా పరిశ్రమపై కూడా షర్మిల శ్రద్ద పెట్టినట్టే కనిపిస్తుంది.