Advertisement
Google Ads BL

థమన్ కి అసలైన అగ్ని పరీక్ష BB3


అలా వైకుంఠపురముతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చి.. క్రాక్ సినిమాతో మళ్ళీ రీసెంట్ గా హిట్ కొట్టిన థమన్ ఈమధ్య కాలంలో తన సినిమాలకిస్తున్న బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఎక్కువ మార్కులు కొట్టేస్తున్నాడు. సోషల్ మీడియాలో అందరితోనూ శెభాష్ అనిపించుకుంటున్నాడు. జస్ట్ మోషన్ పోస్టర్ కి కూడా తనిచ్చే బీజీఎమ్ వైరాలవుతుంది. టాక్ అఫ్ ద టౌన్ అవుతుంది. అలాంటి థమన్ కి అగ్ని పరీక్ష పెట్టారు బాలయ్య, బోయపాటి.  ఈమద్యే BB3 రషెస్  చూసిన థమన్ తనకి రీ రికార్డింగ్ కోసం నెలన్నర టైం కావాలని అడిగాడట. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ చెయ్యడానికి తనకి ఎక్కువ టైం కావాలని అడిగాడట థమన్. 

Advertisement
CJ Advs

ఆ ఇంటర్వెల్ బ్లాక్ అనేది మ్యూజిక్ డైరెక్టర్ గా తన కెరీర్ లోనే పెద్ద ఛాలెంజ్ అని థమన్ చెబుతున్నాడు అంటే బోయపాటి - బాలయ్య నుండి ఎక్సట్రార్డినరీ ఫిలిం రాబోతుంది అనేది అర్ధమవుతుంది. దీనిని ఛాలెంజ్ గా తీసుకున్నాడు థమన్ అంటే BB3 ఎలా ఉండబోతుందో, ఎంత ఎక్సట్రార్డినరీ గా ఉండబోతుంది అనేది నందమూరి అభిమానులకి ఓ క్లారిటీ ఇచ్చేసినట్టే. మరి టైటిల్ విషయంలో సస్పెన్స్ మెయింటింగ్ చేస్తున్న బోయపాటి - బాలయ్య లు BB3 కి అదిరిపోయే టైటిల్ ని ఎంపిక చేసుకుని పెట్టారని.. ఓ మంచి ముహూర్తాన బాలయ్య మాస్ లుక్ తో పటు టైటిల్ రిలీజ్ చెయ్యాలని వెయిట్ చేస్తున్నారట. ప్రస్తుతం థమన్ ఇచ్చిన హైప్ తో సినిమాపై అందరిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక బాలయ్య - బోయపాటి BB3 షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన స్పెషల్ సెట్ లో జరుగుతుంది. 

The original test for Thaman was BB3:

Balayya - Boyapati BB3 Biggest update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs