Advertisement
Google Ads BL

చల్లని కబురు కోసం వేయి ఆశలతో వెయిటింగ్


అందాల రాక్షసిగా టాలీవడ్ కి హీరోయిన్ గా పరిచయమయిన లావణ్య త్రిపాఠికి భలే భలే మగాడివోయ్ తప్ప కెరీర్ లో గుర్తుండిపోయే మరో హిట్ ఒక్కటీ తగల్లేదు. సీనియర్ హీరో నాగార్జున తో చేసిన సోగ్గాడే చిన్ని నాయన పెద్ద హిట్ అయినా అది లావణ్యకి ఎలాంటి ప్లస్ కాలేదు. ఇక అటు ట్రెడిషనల్ గా ట్రై చేసినా.. ఇటు గ్లామర్ తో కష్టపడినా సరైన హిట్ మాత్రం పడలేదు. అయితే రీసెంట్ గా కార్తికేయ - లావణ్య త్రిపాఠి కాంబోలో తెరకెక్కుతున్న చావుకబురు చల్లగా సినిమాపై లావణ్య వేయి ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే చావుకబురు చల్లగా ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. మే లో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న చావుకబురు చల్లగా సినిమాపై అటు హీరో  కార్తికేయ, ఇటు లావణ్య త్రిపాఠిలు కోటి ఆశలు పెట్టుకున్నారు. 

Advertisement
CJ Advs

అయితే చావు కబురు చల్లగా సినిమా సేఫ్ హాండ్స్ లో ఉంది. సేఫ్ హాండ్స్ అంటే యూవీ క్రియేషన్స్ వారు, అల్లు అరవింద్, బన్నీ వాస్ లాంటి పెద్దల చేతిలో ఉంది కాబట్టి ఈ సినిమా మంచి స్క్రిప్ట్ అయ్యుంటుంది అనే ఆసక్తితో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. RX 100 హిట్ తప్ప మరో సినిమా హిట్ కొట్టలేని కార్తికేయ.. ఇక ఒక్క హిట్, ఒకే ఒక్క హిట్ అంటూ ఎదురు చూస్తున్న లావణ్య కూడా చావు కబురు చల్లగా హిట్ అవ్వాలనే చల్లని కబురు కోసం వేయి ఆశలతో వెయిటింగ్ అంటున్నారు.

Waiting with a thousand hopes for a nice hit :

chavu kaburu challaga release on may 19th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs