Advertisement
Google Ads BL

ఆలస్యమైనా.. అద్భుతమైన డేట్ తో..


కరోనా క్రైసిస్ వలన థియేటర్స్ అన్ని మూగబోయాయి. హీరోలంతా కామ్ గా సైలెంట్ గా ఇళ్లకే పరిమితమయ్యారు. ఆగస్టు నుండి సినిమా షూటింగ్స్ ప్రారంభమైనా థియేటర్స్ బంద్ వలన ఏ సినిమా రిలీజ్ కి రెడీ అవలేదు. కనీసం డేట్ ఇచ్చే సాహసము చెయ్యలేదు. కానీ జనవరి లో సంక్రాతి సినిమాల ఊపు చూసి దర్శకులు, హీరోలు, పాన్ ఇండియా స్టార్స్ అంతా ఒక్కసారిగా తమ తమ సినిమాల రిలీజ్ డేట్స్ ని ప్రకటించేసారు. మార్చ్ నుండి అక్టోబర్ వరకు ఏ వీక్ ని వదలకుండా ఖచ్చిఫ్ లు వేసేసారు. అందులో ఎంతమంది డేట్ కి ఫిక్స్ అవుతారో.. ఎంతమంది వెనక్కి వెళతారో తెలియదు కానీ. చిరు ఆచార్య దగ్గరనుండి, RRR, నారప్ప, పుష్ప ఇలా భారీ బడ్జెట్ చిన్నా చితక సినిమాలన్ని పొలోమంటూ డేట్స్ లాక్ చేసేశాయి. కానీ పూరి - విజయ్ దేవరకొండలు కామ్ గా వేడుక చూసారు. 

Advertisement
CJ Advs

గుంపులో గోవిందంలా లైగర్ డేట్ ఇవ్వడమెందుకు అనుకున్నారో ఏమో.. రేపు ఉదయం లైగర్ డేట్ ఇవ్వబోతున్నట్టుగా ఎనౌన్స్ చేసారు. జస్ట్ విజయ్ అండ్ పూరి లైగర్ రిలీజ్ డేట్ ఇస్తామని చెప్పిన వెంటనే విజయ్ లైగర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే తో కలిసి లైగర్ నిర్మాత ఛార్మి స్పెషల్ వీడియోతో లైగర్ డేట్ రేపు ఇవ్వబోతున్నట్టుగా ట్వీట్ చేసారు. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్ నుండి లైగర్ డేట్ ఎనౌన్సమెంట్ రాబోతున్నట్టుగా ప్రకటించారు. మరి అందరు హీరోలులా హడావిడిగా కాకుండా విజయ్ దేవరకొండ కాస్త ఆలస్యమైనా అద్భుతమైన డేట్ కి లైగర్ ని దింపబోతున్నారన్నమాట. 

Late though but with amazing date:

Vijay Liger release date to be out tomorrow
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs