Advertisement
Google Ads BL

30 డేస్ కి లేదు డౌట్.. ఇవి 3 డేస్ కే ఔట్


సంక్రాంతి సినిమాల జోరు హోరు తగ్గడమే కాదు.. సంక్రాతి సినిమాలన్నీ అప్పుడే ఓటిటిలో ప్రత్యక్షమయ్యాయి కూడా. ఈ సంక్రాంతి హిట్ క్రాక్ కూడా ఆహా ఓటిటి ద్వారా ఆన్ లో విడుదలైపోయింది. ఇక ఆ తర్వాత మూడు వారాల్లో విడుదలైన మూడు సినిమాలకు ప్లాప్ టాకే పడింది. ప్రేక్షకులు ఓవరాల్ గా మూడు సినిమాలను ప్లాప్ గా తేల్చేసారు. అందులో అల్లరి నరేష్ బంగారు బుల్లోడు డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అలాగే ప్రదీప్ మాచిరాజు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఒకే ఒక్క సాంగ్ తో సేవ్ అయిన సినిమాగా మిగిలిపోయింది. నీలి నీలి ఆకాశం సాంగ్ హిట్ అవడంతో.. 30 రోజుల్లో ప్రేమించడం సినిమాకి ప్లాప్ టాక్ పడినా.. ఆ సినిమా రెవిన్యూ పరంగా లాభాల్లోకి వచ్చేసింది. ఇక ప్రశాంత్ వర్మ - తేజ సజ్జా జాంబీ రెడ్డి కి డిజాస్టర్ టాక్ పది ప్లాప్ లిస్ట్ లో చేరిపోయింది. ఈ మూడు సినిమాల ఫైనల్ కలెక్షన్స్ ఓసారి చూసేద్దాం.

Advertisement
CJ Advs

అల్లరి నరేష్ బంగారు బుల్లోడు 3.5 కోట్లకి జరగగా.. ఫైనల్ రన్ లో బంగారు బుల్లోడు 1.90 కోట్ల కలెక్షన్స్ తో ప్లాప్ గా మిగిలిపోయింది.

ఏరియా                         కలెక్షన్స్ 

నైజాం                           0.57

సీడెడ్                           0.32

ఉత్తరాంధ్ర                     0.27

ఈస్ట్                             0.17

వెస్ట్                              0.12

కృష్ణా                            0.14

గుంటూరు                      0.16

నెల్లూరు                        0.09

ఏపీ అండ్ టీఎస్             1.84 కోట్లు

రెస్ట్ అఫ్ ఇండియా           0.07

ఓవర్సీస్                        0.04

టోటల్ వరల్డ్ వైడ్            1.94 కోట్లు (షేర్)

ప్రదీప్ మంచి రాజు హీరోగా ఎంట్రీ ఇచ్చిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాని నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్న సాంగ్ సేవ్ చేసింది. లేదంటే ఈ సినిమా కూడా కలెక్షన్స్ పరంగా ప్లాప్ లిస్ట్ లో చేరిపోయేది. 4.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరగగా ఫైనల్ రన్ లో 6.86 కోట్లు కొల్లగొట్టింది. దానితో సక్సెస్ లిస్ట్ లో చేరింది.

ఏరియా                         కలెక్షన్స్ 

నైజాం                           2.07

సీడెడ్                           1.28

ఉత్తరాంధ్ర                     0.83

ఈస్ట్                             0.50

వెస్ట్                              0.40

కృష్ణా                            0.48       

గుంటూరు                      0.55

నెల్లూరు                        0.30

ఏపీ అండ్ టీఎస్             6.41 కోట్లు  

రెస్ట్ అఫ్ ఇండియా           0.21

ఓవర్సీస్                        0.24

టోటల్ వరల్డ్ వైడ్            6.86 కోట్లు 

ఇక రీసెంట్ గా విడుదలైన జాంబీ రెడ్డి సినిమాకి ప్లాప్ టాక్ రాగా.. చిత్ర బృందం మాత్రం జాంబీ రెడ్డి థియేటర్స్ టూర్ అంటూ హంగామా చేస్తున్నా ఆ సినిమా కలెక్షన్స్ లో ఎలాంటి మార్పు లేదు. జాంబీ రెడ్డి 6 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగితే.. ఈ సినిమా ప్లాప్ టాక్ తో ఇప్పటివరకు 3.85 కోట్లు తెచ్చుకుంది. మరి ఫైనల్ రన్ లో జాంబిరెడ్డి ఏమేర కాలక్షన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

No doubt for 30 days, these are 3 days out:

Flop talk for three films released in these three weeks
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs