Advertisement
Google Ads BL

నిప్పులా మారిన ఉప్పెన క్లయిమాక్స్


గత నాలుగు రోజులుగా సోషల్ మీడియా మొత్తం హోరెత్తిపోతుంది ఉప్పెన క్లైమాక్స్ గురించి. ఉప్పెన సెన్సార్ రిపోర్ట్ షీట్ బయటికి రావడం, అందులో సెన్సార్ కట్స్ చూడడంతో అది ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యిపోయింది. క్లైమాక్స్ లో విలన్ విజయ్ సేతుపతి హీరో వైష్ణవ తేజ్ చేతులు నరికేస్తాడని, కాదు హీరో పురుషాంగాన్ని విలన్  కత్తిరిస్తాడంటూ ఏవేవో ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దానిని కొంతమంది కామెడీ చేస్తుంటే కొంతమంది సింపతీ చూపిస్తున్నారు.. అసలు ఆ పాయింట్ ఏమిటంటూ పిచ్చిగా అంటూ తిట్టేవారూ ఉన్నారు. మొన్న ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరు కూడా స్టేజ్ మీద ఉప్పెన క్లయిమాక్స్ విషయంలో తడబడింది, తపన పడింది ఆ పాయింట్ మీదే. 

Advertisement
CJ Advs

మొత్తానికి ఇంకో రెండు రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతున్న ఉప్పెన సినిమా మాత్రం.. ఆ ఒక్క క్లైమాక్స్ లీకవడంతో అందరిలోనూ నిప్పులా మారి డిస్కర్షన్ టాపిక్ అయ్యింది. దీని రిజల్ట్ ని ఎక్కువ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఆ ఉప్పెన క్లయిమాక్స్ కే ఉంది. లీడ్ పెయిర్ బావుంది, విలన్ సేతుపతి ఎంత రాణించినా, మ్యూజిక్, పాటలు రీ రికార్డింగ్ ఎంత బావున్నా క్లైమాక్స్ కే ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి.. అది కత్తి మీద సామే అవుతుంది. ఉప్పెన క్లయిమాక్స్ మీద వస్తున్న వార్తలు నిజమే అయితే అది గనక కత్తి మీద సామే  అవుతుంది. ఆ సాము ఎంత బాగా సానబెట్టారో బుచ్చిబాబు సానానే చూపించాలి. 

అవన్నీ పక్కనబెడితే అటు లీడ్ పెయిర్ బావుంది అని వచ్చిన టాక్ వలనో, విజయ్ సేతుపతి ఉన్నాడని వచ్చిన హైప్ వలనో, సాంగ్స్ తీసుకొచ్చిన క్రేజ్ వలనో వీటన్నిటిని మించి మైత్రి మూవీ మేకర్స్ చేస్తున్న అద్భుతమైన పబ్లిసిటీ వల్లో మొత్తానికి అయితే ఉప్పెన సినిమానికి అద్భుతమైన ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తుంది. మొదటి రోజే నాలుగు కోట్లు దాటే అవకాశం గట్టిగా కనిపిస్తున్నాయి ఆనేది ట్రేడ్ వర్గాల కామెంట్.

Uppena Climax taking big turns:

Disturbing Climax for Mega Hero Vaishnav Tej
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs