వైఎస్ షర్మిల.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. వైఎస్ జగన్ సీఎం గా మారక చెల్లెలు షర్మిల ని పక్కనబెట్టడంతో ఇప్పుడు షర్మిల ఆంధ్రాలో కాకుండా తెలంగాలో కొత్త పార్టీ పెట్టడానికి రెడీ అయ్యింది. నిన్నమొన్నటివరకు పార్టీ పెట్టను అంటూనే నేడు తన మనసులోని మాటలను బయటపెట్టింది. తెలంగాణాలో తన కొత్త పార్టీ స్థాపించబోతున్నట్టుగా త్వరలోనే అన్ని విషయాలను చెబుతా అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చింది. అయితే ఇప్పటివరకు వైఎస్ షర్మిల పార్టీ విషయంలో కామ్ గా వున్న వైసిపి మంత్రులు డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ షర్మిల్ పార్టీకి వైసిపికి సంబంధం లేదని చెబుతున్నారు. మంత్రి సజ్జల మీడియా సమావేశంలో షర్మిల కి పదవులు ఇవ్వలేదని షర్మిల పార్టీ పెట్టింది అని ఆనుకోవడం లేదు. అన్న జగన్, చెల్లి షర్మిల మధ్యన విభేదాలు లేవు. వారి మధ్యన అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఉంది. జగన్ కి షర్మిలకు అభిప్రాయం భేదాలు ఉండొచ్చు కానీ వారి మధ్యన విభేదాలు లేవంటూ క్లారిటీ ఇస్తున్నారు.
మరి అభిప్రాయం భేదాలకు, విభేదాలకు తేడా ఏమిటో స్పష్టతనివ్వలేదు సదరు మంత్రి గారు. షర్మిల గురించి మాకు తెలియదంటే అది మేము బుకాయించినట్లే అవుతుంది. షర్మిల కొత్త పార్టీ ఏర్పాట్లు గత మూడు నెలలుగా జరుగుతుంది. ఆ విషయం జగన్ గారికి తెలుసు. కాకపోతే పార్టీ పెడుతున్నా అని జగన్ మోహన్ రెడ్డి గారికి షర్మిల చెప్పలేదు. జగన్ సలహా తీసుకోలేదు. సో షర్మిల పార్టీతో వైసీపీ కి ఎలాంటి సంబంధం లేదని కుండబద్దలు కొట్టారు వైసీపీ మంత్రి సజ్జల. తెలంగాణాలో వైసీపీ పార్టీ పెడితే.. ఏపీ రాజకీయాలకు తెలంగాణకు మధ్యన గ్యాప్ వస్తుంది అని జగన్ గారు తెలంగాణాలో పార్టీ పెట్టలేదు. విభజన తర్వాత రెండు రాష్ట్రాలు సమన్వయంతో పని చేసుకోవాలి. అందుకే జగన్ తెలంగాణాలో పార్టీ వద్దన్నారు. ఏపీలో జరుగుతూన్న అభివృద్ధి తెలంగాణాలో ఎందుకు జరగకూడదనే షర్మిల తెలంగాణాలో పార్టీ పెడుతుంది అంటూ వైసిపికి షర్మిల పార్టీ కి సంబంధమే లేదు అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు సజ్జల.