సినిమా వాళ్ళకి అన్ సీజన్ అంటే ఫిబ్రవరి -మార్చి. ఎందుకంటే పిల్లలంతా ఎగ్జామ్స్ హడావిడిలో వేడెక్కిపోయి ఉంటారు. ఫిబ్రవరి, మార్చ్ రెండు నెలలు ఎగ్జామ్ ఫీవర్ తో ఉండే స్టూడెంట్స్, పేరెంట్స్ అంతా వేసవి అంటే ఏప్రిల్ లాస్ట్ వీక్ నుండి ఫ్రీ అవుతారు. దానితో వేసవి సెలవలు స్టార్ట్ అవుతాయి. ఇక ఏప్రిల్ మొదలు పెద్ద సినిమాల హడావిడి మొదలవుతుంది. భారీ బడ్జెట్ మూవీస్, క్రేజ్ ఉన్న మూవీస్ అన్ని వేసవిని టార్గెట్ చేస్తాయి. పిల్లలంతా కూల్ గా ఏసీలో థియేటర్స్ లో బొమ్మ చూసేందుకు రెడీ గా ఉంటారు. అప్పుడు దర్శకనిర్మాతలకు కాసుల పంట. కానీ ఈసారి కరోనా క్రైసిస్ మొత్తం మార్చేసింది. ఫిబ్రవరి, మార్చి లో ఎలాంటి ఎగ్జామ్స్ లేవు. కేవలం నార్మల్ వర్కింగ్ డేస్ తప్ప. ఈసారి ఎగ్జామ్స్ అన్ని మే, జూన్ కి షిఫ్ట్ అయ్యాయి. ఇంటర్ మే లో ఉంటె.. పది తరగతి పరీక్షలు జూన్ కి వెళ్లాయి. అంటే మే, జూన్ కూడా పిల్లలు, పేరెంట్స్ అంతా వేసవి తాపంతో పాటుగా హీటెక్కిపోయి ఉంటారు.
మరి మే లో సీనియర్ హీరోలైన చిరు, వెంకీ, బాలయ్య లు తమ సినిమాల డేట్స్ లాక్ చేసుకున్నారు. మే 13 న చిరు ఆచార్య తో థియేటర్స్ లో రిలీజ్ అంటే, వెంకటేష్ నారప్ప మే 14 న పోటీకి దిగబోతుంది. మరోపక్క బాలకృష్ణ - బోయపాటి BB3 కూడా మే 28 న రిలీజ్ డేట్స్ ఇచ్చాయి. మరి మే నెల అంతా ఎండలు.. దానికి తోడు విద్యార్థుల పరీక్షలతో చిరు, వెంకీ, బాలయ్యలకు వేసవి కష్టం ఏమిటో తెలుస్తుంది అంటున్నారు. మరి రిలీజ్ డేట్స్ విషయంలో పోటీకి దిగి సీనియర్ హీరోలంతా మే కి ఫిక్స్ అయ్యి ఇప్పుడు అడ్డంగా ఇరుక్కున్నారుగా.