Advertisement
Google Ads BL

సమంత మాత్రమేనా.. కాజల్ కూడా..


కెరీర్ పీక్స్ లో ఉన్నపుడే సమంత నాగ చైతన్య ని ప్రేమించి వివాహం చేసుకుంది. చైతన్యతో ఐదేళ్ల ప్రేమని పెద్దల అంగీకారంతో పెళ్లిగా మార్చుకున్న సమంత.. అక్కినేని ఇంటి కోడలిగా అడుగు పెట్టాక.. నాగ్ ఫ్యామిలిలో ఓ సభ్యురాలిగా మారిపోయింది. అక్కినేని ఫామిలీ మెంబెర్స్ తో నాగ్ ఫ్యామిలీతో మంచి రిలేషన్షిప్ మెయింటింగ్ చెయ్యడమే కాదు అటు దగ్గుబాటి ఫ్యామిలితోను సమంత బాగా కలిసిపోతుంది. అయితే పెళ్లిని సాంప్రదాయబద్దంగా హిందూ, క్రిష్టియన్ సాంప్రదాయంలో చేసుకున్న సమంత, తరవాత చైతన్య ఇంటిపేరు అక్కినేనిని తన ఇంటి పేరుగా మార్చుకుంది. తన సోషల్ మీడియా అకౌంట్స్ ఫేస్ బుక్, ఇన్స్టా, ట్విట్టర్ అన్నిటిలోను అక్కినేని సమంతగా తన సర్ నేమ్ మార్చుకుంది.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు మరో భామ కాజల్ అగర్వాల్ కూడా తన ఏడేళ్ల స్నేహితుడిని ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గౌతమ్ కిచ్లు ని పెళ్లాడిన కాజల్ అగర్వాల్ తర్వాత తరుచు తన భర్త తో గడుపుతున్న మధుర క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. అయితే తాజాగా సమంత లాగా కాజల్ కూడా తన పేరుని మార్చేసింది. తన భర్త పేరు కలిసి వచ్చేలా కాజల్ ఎ కిచ్లు అని పేరు మార్చేసుకుంది. తన పేరు పక్కనే భర్త పేరు ఉండేలా కాజల్ అగర్వాల్ ఇన్స్టా ఖాతాలో పేరు మార్పులు చేసింది. మరి కాజల్ ప్రస్తుతం ఆచార్య సినిమాతోనే కాదు.. మోసగాళ్లు ఇంకా వెబ్ సీరీస్ లతో అగర్వాల్ ఫుల్ బిజీ. 

Kajal changed her name in insta:

Kajal changed her name to A Kitchlu to match her husband's name
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs