Advertisement
Google Ads BL

ఏపీ పాలిటిక్స్ పై బాలయ్య సెన్సేషనల్ కామెంట్స్


బోయపాటి సినిమా షూటింగ్ లో బిజీగా వున్న బాలయ్య అవకాశం వచ్చినప్పుడు రాజకీయాల్లోనూ చురుగ్గానే పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయ నాయకుల్లో హీట్ పెంచుతున్నాయి. టిడిపి, వైసీపీ నువ్వా - నేనా అంటూ పోటీపడుతుంటే, SEC నిమ్మగడ్డ vs వైసీపీ మంత్రుల మధ్యన రచ్చ రోజుకో మలుపు తిరుగుతుంది. అక్కడ ఏపీలో రాక్షస పాలన సాగుతుంది అంటూ హిందూపురం ఎమ్యెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసారు. నెల్లూరు టిడిపి క్యాండిట్ తో ఫోన్ లోనే ప్రచారం చేసిన బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఏపీ లో రాక్షస పాలన సాగుతుంది. 

Advertisement
CJ Advs

తాడిపత్రి నా జన్మ స్థలం. బోయపాటి సినిమా షూటింగ్ పూర్తి కాగానే రోడ్ల మీదకి వస్తాను. BB3 షూటింగ్ పూర్తి అవ్వగానే ప్రజలను కలుస్తాను. నా అసలు అవతారం చూపిస్తాను. దేనికి భయపడవద్దు.. అయ్యేదేదో అవుతుంది అంటూ బాలయ్య అధికార పక్షాన్ని ఒళ్ళు దగ్గరపెట్టుకోమంటూ సంచలన కామెంట్స్ చేసారు. మరి బాలకృష్ణ రంగంలోకి దిగనంత వరకే దిగితే ఎదుటివాడి గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే అంటూ నందమూరి అభిమానులు బాలయ్య వ్యాఖ్యలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

Balakrishna Sensational Comments on AP Politics:

Balakrishna hot Comments on AP Politics
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs