Advertisement
Google Ads BL

19 నుంచి పవన్-క్రిష్ ఫిల్మ్ ఫ్రెష్ షెడ్యూల్


లాక్ డౌన్ ముందే క్రిష్ - పవన్ కాంబో మూవీ షూటింగ్ మొదలైంది. కొద్దిపాటి షూటింగ్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకోవడం మధ్యలో కరోనా రావడంతో.. క్రిష్ - పవన్ మూవీకి భారీ బ్రేక్ వచ్చింది. మళ్ళీ ఏడాది తర్వాత క్రిష్ - పవన్ షూటింగ్ సంక్రాంతి పండగ తర్వాత మొదలైనా.. ఒక షెడ్యూల్ తర్వాత పవన్ కళ్యాణ్ ఏకే రీమేక్ షూటింగ్ లోకి జంప్ అయ్యారు. అటు ఏకే రీమేక్ ఇటు పొలిటికల్ మీటింగ్స్ తో బిజీగా వున్న పవన్ కళ్యాణ్ కి కావల్సిన హీరోయిన్, విలన్, అలాగే మిగతా నటులని క్రిష్ సెట్ చేసి పెట్టుకుంటున్నాడు. ఇప్పటికే హీరోయిన్ గా నిధి అగర్వాల్ ఫిక్స్ కాగా.. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర అంటే క్వీన్ పాత్ర కోసం బాలీవుడ్ భామ జాక్వలిన్ ఫెర్నాండేజ్ ని ఎంపిక చేసుకున్నాడు క్రిష్.

Advertisement
CJ Advs

ఇక పవన్ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ ని తీసుకున్న క్రిష్, పవన్ సినిమా కోసం హరిహర వీరమల్లు, హరహర మహాదేవ టైటిల్స్ పరిశీలనలో ఉన్నాడు. పవన్ ఈ రెండిటిలో దేనికి ఓకె చెబుతాడా అని క్రిష్ ఎదురు చూస్తున్నాడు. ఇక ఏకే రీమేక్, అలాగే పాలిటిక్స్ లో బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమా కోసం ఈ నెల 19 నుండి డేట్స్ కేటాయించబోతున్నాడు. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేక సెట్ లో ఈనెల 19 నుండి పవన్ - క్రిష్ ఫ్రెష్ షెడ్యూల్ మొదలు కాబోతుంది. మరి పవన్ కళ్యాణ్ తో సినిమా ఒప్పుకున్నాక లాంగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోవడానికి లేకుండా పోయింది క్రిష్ కి.  పవన్ రెండు సినిమాలను పారలల్ గా చెయ్యడంతో క్రిష్, పవన్ వచ్చినప్పుడు షూటింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. 

Pawan-Krish film fresh schedule from 19th :

Pawan-Krish film New schedule from 19th&nbsp;<span>February</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs