Advertisement

అల్లు అర్జున్ కారవ్యాన్ కు ప్రమాదం


సుకుమార్ - అల్లు అర్జున్ కాంబోలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పాన్ ఇండియా ఫిలిం పుష్ప సినిమా రెండు భారీ షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసింది. నవంబర్ లో మొదలైన పుష్ప షూటింగ్ ఏకధాటిగా నిన్నటివరకు జరిగింది. రంపచోడవరం, మారేడుమిల్లు అడవుల్లో పుష్ప సినిమాలోని రెండు భారీ షెడ్యూల్స్ పూర్తి చేశామంటూ పుష్ప టీం బిగ్ అప్ డేట్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. పుష్ప సినిమా కోసం ఫ్యామిలీకి దూరంగా అల్లు అర్జున్ రంపచోడవరం, మారేడుమిల్లు సమీపంలోనే స్టే చేసి పుష్ప షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అయితే పుష్ప షూటింగ్ ముగించుకుని హైదరాబాద్ కి బయలు దేరిన పుష్ప యూనిట్, అల్లు అర్జున్ కారవ్యాన్ మార్గమధ్యలో ఖమ్మం సమీపంలో యాక్సిడెంట్ అయ్యింది.

Advertisement

ప్రస్తుతం అల్లు అర్జున్ కారవ్యాన్ ని వెనకనుండి లారీ ఢీ కొట్టిన పిక్స్ సోషల్ మీడియాలో వైరాలవుతున్నాయి.  ఖమ్మం రూరల్ సత్యనారాయణపురం వద్ద ఈ ఘటన జరిగింది. అయితే కారవాన్ మీద అల్లు అర్జున్ లోగో ఉండడంతో అక్కడున్నవారు అల్లు అర్జున్ కి గాయాలు అయి ఉంటాయనుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ అల్లు అర్జున్ అందులో లేడు. ఎప్పుడో ఆయన హైదరాబాద్ కి వచ్చేసారు. అర్జున్ తన పిల్లలు అయాన్, అర్హలతో వాల్యుబుల్ టైం స్పెండ్ చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక అల్లు అర్జున్ తన కారవ్యాన్ ని కోట్లు వెచ్చించి తన కోసం స్పెషల్ గా డిజైన్ చేయించుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ యాక్సిడెంట్ లో అల్లు అర్జున్ కారావ్యాన్ కి చిన్న పాటి డ్యామేజ్ తప్ప పెద్ద ప్రమాదం జరగలేదని చెబుతున్నారు.

Allu Arjun caravan accident:

Pictures of truck hitting Allu Arjun's caravan from behind are going viral on social media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement