Advertisement
Google Ads BL

బన్నీకి లైన్ వేస్తున్న బాలీవుడ్ పోరి


బన్నీ పుష్ప సినిమాతో పాన్ ఇండియాలోకి అడుగుపెడుతున్నాడు. పుష్ప సినిమా బాలీవుడ్ లో అనుకోకముందు నుండే బన్నీ బాలీవుడ్ పరిచయాలు, ఆయన బాలీవుడ్ పిఆర్ టీం అన్ని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టీవ్ గా పని చేస్తున్నాయి. టాలీవుడ్ హీరోలకన్నా ముందే బన్నీ బాలీవుడ్ లో పాగా వెయ్యాలనుకున్నా సరైన ప్లాట్ ఫామ్ దొరక్క పుష్ప వరకు వెయిట్ చేసి మరీ పుష్ప తో పాన్ ఇండియా లెవల్ మూవీ చేస్తున్నాడు. అయితే బన్నీతో సినిమాలు చెయ్యాలని చాలామంది హీరోయిన్స్ కి ఆశ ఉన్న ఆ అవకాశం కొందరికే దక్కుతుంది. తాజాగా ఓ బాలీవుడ్ హీరోయిన్ బన్నీపై మనసు పారేసుకోవడమే కాదు.. బన్నీ కి లైన్ కూడా వేస్తుంది. ఆమె ఎవరో కాదు.. సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 తో వెండితెరకు పరిచయమైన సాయి మంజ్రేకర్. 

Advertisement
CJ Advs

లేలేత అందాల బాబ్లీ గర్ల్ సాయి మంజ్రేకర్ టాలీవుడ్ హీరోలైన అడివి శేష్, వరుణ్ తేజ్ సినిమాలైనా మేజర్, గని సినిమాల్లో నటిస్తుంది. అయితే తాను ముంబై లో తాజ్ హోటల్ కి వెళ్ళినప్పుడు తాజ్ లో జరిగిన ఉగ్రదాడి గురించి తన ఫాదర్ మహేష్ మంజ్రేకర్ చెప్పినప్పుడు చాలా బాధపడ్డా అని, అదే మేజర్ సినిమాలో ఇప్పుడు నటించడం ఆశ్చర్యంగా ఉంది అంటుంది. పవర్ ఫుల్ మూవీ తో తెలుగులోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉంది అంటుంది.

ఇక తన తండ్రి మహేష్ మంజ్రేకర్ ఎప్పుడో చెప్పారని నటిగా మారాక కథ నచ్చితే ఏ భషా చిత్రం అయినా ఓకె చేసేయ్.. భాష గురించి భయపడకు, అందులోని ఇబ్బందులు గురించి ఆలోచించకు అంటూ చెప్పిన మాటలు గుర్తు ఉన్నాయంటుంది ఈ భామ. ఇక టాలీవుడ్ లో అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమట. గత కొన్ని రోజులుగా బన్నీ తో కలిసి నటిస్తున్నా అంటూ వస్తున్న వార్తలు చూసి.. అది నిజమైతే ఎంత బావుంటుంది అంటూ కలలు కంటున్నట్టుగా చెబుతుంది. నాకు తెలుగు అవకాశాలు రాగానే నేను తెలుగులో చూసిన ఫస్ట్ మూవీ అలా వైకుంఠపురములో.. ఆ సినిమా నాకు బాగా నచ్చింది. అందులో బన్నీ నటన, ఆయన డాన్స్ నాకు చాలా నచ్చాయి.. బన్నీ తో అవకాశం వస్తే వదలను అంటుంది సాయి మంజ్రేకర్.

I like Bunny acting and his dance very much :

Saiee Manjrekar says he will not give up if he gets a chance with Bunny
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs