వరసగా అన్ని సినిమాల రిలీజ్ డేట్స్ వచ్చేస్తున్నాయి. అన్ని సినిమాలు ఏ డేట్ కి ఆ డేట్ కచ్చిఫ్ వేసుకుని కూర్చుంటున్నాయి. కానీ ఎప్పుడో కంప్లీట్ అయిపోయిన చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి కి మాత్రం ఇప్పటివరకు డేట్ దొరకడం లేదు. ఆల్రెడీ సూపర్ మచ్చి సినిమాని పూర్తి చేసేసిన కళ్యాణ్ దేవ్ కిన్నెరసాని షూటింగ్ కూడా కంప్లీట్ చేసేస్తున్నాడు. కానీ చిరంజీవి చిన్నల్లుడిని పట్టించుకోవడం లేదేమిటో.. ఇప్పటికే మెగా కాంపౌండ్ నుండి అల్లు అర్జున్ పుష్ప ఆగస్టు 13 న రిలీజ్ కి రెడీ చేస్తున్నాం అంటూ అల్లు అర్జున్ తెగ హడావిడి చేస్తున్నాడు. షూటింగ్ కి గ్యాప్ లేకుండా కొడుతున్నాడు. మరోపక్క నిన్నగాక మొన్న షూటింగ్ మొదలు పెట్టిన వరుణ్ తేజ్ గని కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేసుకుంది.
ఇక రామ్ చరణ్ పాన్ ఇండియా ఫిలిం RRR అక్టోబర్ లో డేట్ లాక్ చేసారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఏప్రిల్ 9 న విడుదల అంటూ దిల్ రాజు గ్రాండ్ గా ప్రకటించేసారు. మెగాస్టార్ చిరు అయితే ఆచార్య టీజర్ తో సహా ఆచార్య ని మే 13 న రిలీజ్ చెయ్యబోతున్నామంటూ హంగామా చేసారు. అయితే అందులో ఎన్ని కరెక్ట్ డేట్ కి రిలీజ్ అవుతాయో.. ఎన్ని డేట్స్ చేంజ్ చేసుకుంటాయో కానీ.. చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి ఊసే లేదు. కనీసం సూపర్ మచ్చి ప్రమోషన్స్ లేవు. పోస్టర్ లేదు. మెగా హీరోలే కాదు.. ఇండస్ట్రీలోని దాదాపుగా హీరోలంతా తమ సినిమాలకు రిలీజ్ డేట్స్ ప్రకటించేసారు. కానీ చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ని ఎవరూ పట్టించుకోవడం లేదా? లేదంటే ఆయనే సైలెంట్ గా ఉన్నాడా? అనేది మెగా ఫాన్స్ కే అర్ధం కావడం లేదు.