Advertisement
Google Ads BL

ఏజ్ కి ఇమేజ్ కి తగ్గ పర్ ఫెక్ట్ రీమేక్


హీరో రాజశేఖర్ గరుడ వేగ సినిమాతో కం బ్యాక్ ఇచ్చారు. కల్కి నిరాశపరిచినా కరోనా కాస్త కంగారు పెట్టినా.. మళ్ళీ కోలుకుని నెక్స్ట్ ఫిలిం కోసం రెడీ అయ్యారు. అయితే రాజశేఖర్ తన నెక్స్ట్ ఫిలిం కోసం ఓ పర్ఫెక్ట్ మలయాళ రీమేక్ ని సెట్ చేసుకున్నారు. రాజశేఖర్ ఏజ్ కి తన ఇమేజ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే రీమేక్ ఇది. మలయాళంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ ని రాజశేఖర్ శేఖర్ గా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా వర్కౌట్ అవడం ఖాయంగానే కనబడుతుంది. ఎందుకంటే శేఖర్ ఫస్ట్ లుక్ లో రాజశేఖర్ తెల్ల‌గ‌డ్డం, పిల్లి క‌ళ్ల‌తో కొత్త‌గా క‌నిపిస్తున్నాడు. ఫస్ట్ టైం త‌న వ‌య‌సుకి త‌గిన పాత్ర‌లో కనిపిస్తున్నారు రాజశేఖర్ ‌.

Advertisement
CJ Advs

మల్లిఖార్జున్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మలయాళంలో బిగ్గెస్ట్ హిట్ అవడంతో ఈ రీమేక్ పై రాజశేఖర్ కూడా  నమ్మకం పెట్టుకున్నారు. ఈ రోజు రాజశేఖర్ బర్త్ డే సందర్భంగా శేఖర్ ఫస్ట్ లుక్ వదులుతూ.. ప్రియాతి ప్రియమైన, నన్ను ప్రేమించే నా వాళ్లందరికీ, నేను ప్రేమించే నా అభిమానులకు.. అతి భయంకరమైన కొవిడ్-19 నన్ను మరణపు సరిహద్దుల్లోకి తీసుకువెళ్లినా.. మీ ప్రేమాభిమానాలు, నిరంతర ప్రార్ధనలు నన్ను మళ్లీ, ఈ నా పుట్టినరోజు నాడు ఒక కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించే స్థితికి తీసుకు వచ్చాయి. కనిపించని ఆ దేవుడికి, కనిపించే దేవుళ్లైన మీకు, సదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటాను అంటూ అభిమానులకి కృతజ్ఞతలు చెప్పారు. మరి మంచి నిర్ణయం తీసుకుని మంచి సబ్జెక్టు చూజ్ చేసుకుని మంచి సినిమాతో మళ్ళీ మనముందుకు రాబోతున్న రాజశేఖర్ కి హ్యాపీ బర్త్ డే.

 

Perfect remake of the image to age:

Raja SHEKAR Salt n Pepper Look
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs