Advertisement
Google Ads BL

పర్సనల్ విషయాలు జోలికి రావొద్దు


బాయ్ ఫ్రెండ్ తో చక్కర్లు కొట్టి పెళ్లి, పేరంటం అంటూ తిరిగి సినిమాలను పక్కనబెట్టిన శృతి హాసన్.. బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయ్యాక మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీ ఇవ్వడమే క్రాక్ తో బిగ్గెస్ట్ హిట్ అందుకుంది శృతి హాసన్. క్రాక్ లో శృతి లుక్స్ పై కాస్త నెగెటివ్ కామెంట్స్ పడినా.. ఆ సినిమాలో శృతి హాసన్ చేసిన ఫైట్ వలన ఆమెకి ప్రభాస్ పాన్ ఇండియా ఫిలిం సలార్ లో అదిరిపోయే ఆఫర్ వచ్చింది. ప్రస్తుతం శృతి హాసన్ నటించిన వకీల్ సాబ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. మరోపక్క శృతి హాసన్ ప్రభాస్ సలార్ షూటింగ్ లో జాయిన్ అయ్యింది.

Advertisement
CJ Advs

ప్రభాస్ చాలా డెడికేషన్ ఉన్న హీరో అని, ప్రభాస్ చాలా మంచి వ్యక్తి అలాగే నిబద్దత కలిగిన మనిషి. మొదటిసారి ప్రభాస్ తో కలిసి పనిచెయ్యడం చాలా ఆనందంగా ఉంది. సలార్ లో నాది చాలా భిన్నమైన రోల్. ఇంతవరకు చాలా పాత్రలు చేశాను. కానీ సలార్ లో నా పాత్ర వాటికీ పూర్తి భిన్నమని చెప్పిన శృతి హాసన్ తన పర్సనల్ విషయాలు జోలికి రావొద్దు అంటుంది. ఎందుకంటే శృతి హాసన్ పుట్టిన రోజునాడు శృతి డూడుల్ ఆర్టిస్ట్ శాంతను పూజారితో క్లోజ్ గా ఉండడం చూసిన నెటిజెన్స్ శృతి హాసన్ మళ్ళీ బాయ్ ఫ్రెండ్ ని పట్టింది అన్నారు.

ఆ వార్తలపై స్పందించిన శృతి హాసన్ నా పర్సనల్ విషయాల గురించి మాట్లాడడం నాకు నచ్చదు. ప్రస్తుతం నా వర్క్ మీదే నా ఫోకస్ పెట్టాను. సో మీరు నా వర్క్ గురించి మాట్లాడితేనే బావుంటుంది అంటూ స్ట్రయిట్ గానే తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దంటూ చెప్పింది.

Do not let personal matters slip:

Shruti Haasan reacting to the news I do not like to talk about my personal matters. Right now my work is focused on yours. So it would be nice if you could talk about my workshop
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs