Advertisement
Google Ads BL

పుష్ప డ్యామేజ్ ఓ రేంజ్ లో ఉండేలా ఉంది


అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో అదిరిపోయే రేంజ్ లో అదిరిపోయే బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిలిం పుష్ప.. షూటింగ్ రంపచోడవరం అడవుల నుండి తెలంగాణలోని ఖమ్మం అడవుల దగ్గరకి చేరింది. రంపచోడవరం అడవుల నుండి షూటింగ్ ముగించుకుని వెళుతూ బన్నీ అందరికి అంటే అక్కడున్న అభిమానులకి బై చెప్పిన ఫోటో అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేసాడుకూడా. అయితే ఎంతో క్రేజ్ తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా ఫిలింని అల్లు అర్జున్ ఆగష్టు 13 న విడుదల అంటూ ప్రకటించి దర్శకుడు సుకుమార్ కి డెడ్ లైన్ పెట్టడంతో సుకుమార్ ఆఘమేఘాల మీద షూటింగ్ చిత్రీకరణ చేస్తున్నాడు. 

Advertisement
CJ Advs

కానీ పుష్ప షూటింగ్ మొదలైంది మొదలు పుష్ప సెట్స్ నుండి ఫొటోస్ లేదా ఏవేవో సీన్స్ వీడియోస్ లీకవుతూ పుష్ప యూనిట్ కి ఎప్పటికప్పుడు షాకిస్తూనే ఉన్నాయి. గతంలో పుష్ప సెట్స్ నుండి బన్నీ మాస్ లుక్ లీకైంది. ఆ తర్వాత అంటే రీసెంట్ గా పుష్ప సెట్స్ నుండి రష్మిక - అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిస్తున్న ఓ సాంగ్ సన్నివేశాలు అలాగే, పోలీసులకు, అల్లు అర్జున్‌లకు మధ్య జరిగే ఫైట్‌ సన్నివేశం లీకైనట్టుగా తెలుస్తుంది. ఇది ఎక్కువగా వైరల్ అవ్వకుండానే పుష్ప యూనిట్ ఆపినప్పటికీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయి ఆ విషయం సోషల్ మీడియాలో గుప్పుమంది. సెట్స్ నుండి ఎలాంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ లీకవ్వకుండా చిత్ర బృందం ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా ఆ లీకులు ఆగడం లేదంటున్నారు. ఇలాంటి లీకుల వలన పెరిగేది క్రేజ్ కాదు .. డ్యామేజే ఎక్కువగా ఉంటుంది అంటున్నారు.

Pushpa Shooting scene Leaked?:

Allu Arjun Pushpa Shooting scene Leaked?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs