ఊహలు గుససలాడే హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన రాశి ఖన్నా తన సినిమాలతో కన్నా ఆ గుసగుసలతోనే ఎక్కువగా హైలెట్ అయ్యింది. తోలి చిత్రంతోనే తన అందంతో అభినయంతో అందరిని ఆకట్టుకున్న రాశి ఖన్నా ఆపై కూడా కొన్ని సినిమాలతో పర్లేదు.. మంచి సక్సెస్ లే అందుకున్నా.. హీరోయిన్ గా తనకు రావాల్సిన గుర్తింపు దక్కలేదు. ఆఫర్లు రాలేదు. కాకపోతే రాశి ఖన్నాకి టాలీవుడ్ కన్నా తమిళ ఆఫర్స్ వస్తున్నాయి. అలాగే బాలీవుడ్ నుండి వెబ్ సీరీస్ ఆఫర్ అందుకున్న రాశి ఖన్నా.. కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఓ పక్క జిమ్ లోనూ కష్టపడుతుంది.
ఒకప్పుడు బబ్లీగా ఉన్న రాశి ఖన్నా ఈ మధ్య చేసిన భారీ వర్కౌట్స్ తో కండలు కరిగించడమే కాదు.. గ్లామర్ గాను గేట్లు ఎత్తేసి స్టార్ ఆఫర్స్ కోసం ఎదురు చూస్తుంది. ఒక పక్క రాశి ఖన్నా కెరీర్ ఊపందుకుంటున్నా ఆమెకి అనుకున్న స్టార్ అవకాశాలైతే రావడం లేదని నిజం. అయితే టాలీవుడ్ లో ఓ యంగ్ హీరో సపోర్ట్ రాశి ఖన్నాకి ఉంది అనేది ఇండస్ట్రీ గుస గుస. ఇప్పుడు కూడా టాలీవుడ్ పరంగా కెరీర్ డౌన్ ఫాల్ లో ఉన్న రాశి ఖన్నాకి హెల్పింగ్ హ్యాండ్ ఇస్తూ ఆ యంగ్ హీరోనే తన సినిమాలో ఛాన్స్ ఇచ్చి రాశి ఖన్నా కెరీర్ ని బూస్టప్ చెయ్యడానికి ట్రై చేస్తున్నాడనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. మరి ఆ యంగ్ హీరో పుణ్యమా రాశి ఖన్నా టాలీవుడ్ లోనూ ఇకపై గ్లామర్ గా దూసుకుపోతుందేమో చూద్దాం.