Advertisement
Google Ads BL

ఈ హీరోయిన్ హిస్టరీ మార్చగలదా?


నేటి స్టార్ హీరోస్ లాంచింగ్ ఫిలిమ్స్ లో హీరోయిన్స్ ఎవరికైనా గుర్తున్నారా? అంటే కాదనే.. లేదనే..సమాధానాలే వస్తాయి. ఎందుకంటే స్టార్ కిడ్స్, స్టార్ ఫామిలీస్ హీరోస్ లాంచింగ్ ఫిలిమ్స్ లో హీరోయిన్స్ ఎవరూ షైన్ అయిన దాఖలాలు ఇంతవరకు లేవు. అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పక్కన సుప్రియ, మహేష్ బాబు పక్కన ప్రీతి జింటా, ఎన్టీఆర్ పక్కన రవీనా రాజపుట్, ప్రభాస్ పక్కన  తమిళ నటుడు విజయ్ కుమార్ కూతురు శ్రీదేవి, బన్నీ పక్కన అతిధి అగర్వాల్, రామ్ చరణ్ పక్కన నేహా శర్మ, నాగ చైతన్య పక్కన రాధా కూతురు కార్తీక, సాయి ధరమ్ తేజ్ పక్కన సియ్యమి ఖేర్- శ్రద్ద దాస్, అఖిల్ పక్కన సయేశా సైగల్ పెళ్లి చేసుకుని తమిళంలో చిన్నా చితక సినిమాలతో సర్దుకుపోతుంది తప్ప హీరోయిన్ గా మెరుపులు మెరిపించి షైన్ అయిన దాఖలాలు అయితే లేవు.  

Advertisement
CJ Advs

స్టార్ కిడ్స్ పక్కన నటించిన హీరోయిన్స్ ఎవరూ మళ్ళీ పెద్ద పెద్ద హిట్స్ కొట్టి కెరీర్ లో దూసుకువెళ్లిన హీరోయిన్స్ ఎవరూ రాణించిన దాఖలాలు లేవు. అయితే ఉప్పెన సినిమాలో వైష్ణవ తేజ్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమవుతున్న కృతి శెట్టి మాత్రం.. ఉప్పెన సినిమా రిలీజ్ కాకముందే.. అవకాశాల జోరులో తడిచిపోతుంది. సినిమా రిలీజ్ కాకముందే  కరోనా వలన అందరికి డ్యామేజ్ అయితే.. సినిమా రిలీజ్ లేట్ అవడం, ఉప్పెన సాంగ్ యూట్యూబ్ లో బాగా ప్రమోట్ అవడంతో కృతి శెట్టికి మంచి మార్కులు పడడంతో కృతి శెట్టికి మంచి ప్లస్ అయ్యింది. నాని పక్కన సినిమా కన్ఫర్మ్ అయ్యింది,. శ్యామ్ సింగరాయ్ లో నటిస్తుంది. అలాగే సుధీర్ బాబు పక్కన కూడా హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యింది. సో రెండు సినిమాల్లో హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యింది కృతి శెట్టి.

ఇప్పటివరకు స్టార్ కిడ్స్ లాంచింగ్ సినిమాల్లో నటించిన హీరోయిన్స్ రాణించిన దాఖలాలు లేవు. కానీ కృతి శెట్టి మాత్రం మొదటి సినిమా విడుదల కాకముందే రెండు సినిమాల ఛాన్సెస్ కొట్టేసింది. క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటుంది. 

Can this heroine change history?:

Krithi Shetty has been confirmed as the heroine in two movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs