Advertisement
Google Ads BL

పవన్ తో సినిమా - నిప్పులపై నడక


పవన్ కళ్యాణ్ వరసపెట్టి సినిమాలు ప్రకటిస్తూ ఉన్నారు. వీలైనంత వరకు అటూ ఇటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ఒకరోజు మంగళగిరిలో మీటింగ్ పెడితే.. రెండో రోజు షూటింగ్ స్పాట్ లో దర్శనిమిస్తూ.. అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు. అయితే ఈ రెండు పడవల ప్రయాణం మాత్రం దర్శకులకు తలనొప్పిగా మారింది. ఎందుకంటే పవన్ తన లుక్ మార్చడానికి ఏ మాత్రం ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఎప్పుడు ఏ పొలిటికల్ మీటింగ్ కి అటెండ్ కావాలో.. ఎటు వైపు వెళ్లాలో.. ఎక్కువగా తనలో ఫిజికల్ గా కానీ, బాడీ లాంగ్వేజ్ లో కానీ చేంజెస్ చూపించడానికి ఇష్టపడడం లేదు పవన్. లుక్ వైజ్ మాత్రం దర్శకులకు అది చాలా ఇబ్బందే. 

Advertisement
CJ Advs

అసలైతే ఏకే రీమేక్ కోసం డైరెక్టర్ శేఖర్ కే చంద్ర, డిజైనర్ అనిల్ భాను చాలా లుక్స్ డిజైన్ చేసుకుని కూర్చున్నారు. చాలా వర్క్ చేసి పవన్ కళ్యాణ్ కోసం డిఫ్రెంట్ డిఫ్రెంట్ లుక్స్ డిజైన్ చేసి పెట్టారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వాటికీ  వేటికి ఓకె చెప్పకుండా.. యాజిటీజ్ గా ఎలా ఉన్నామో అలానే చేసుకుంటూ వెళ్ళిపోదామని చెప్పారు. అందులోను ఏకే రీమేక్ షూటింగ్ చేసుకుంటూనే క్రిష్ తో చెయ్యబోయే సినిమా షూటింగ్ లో పవన్ పాల్గొనాల్సి ఉంటుంది. అందుకే పవన్ తన లుక్ చేంజ్ కి ఒప్పుకోవడం లేదు. డైరెక్టర్స్ కి పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా ఫీలవుతుంటే.. సినిమాలు కంప్లీట్ చెయ్యడం మాత్రం నిప్పుల మీద నడకలా అనిపిస్తుంది. 

అనుకున్న అవుట్ ఫుట్ వస్తుందా? రాదా? మనం అనుకున్నట్టుగా ప్రెజెంట్ చేయగలమా? లేదా? ఛాన్స్ రావడం ఇంపార్టెంటే.. కానీ అనుకున్న అవుట్ ఫుట్ రావడం ఇంకా ఇంపార్టెంట్ కదా అని పవన్ దర్శకులు మదనపడుతున్నారట.

Pawan does not agree to change his look:

Pawan Kalyan to juggle between Krish Movie and AK remake
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs