బంగారు బుల్లోడు తో అల్లరి నరేష్ భంగపడ్డాడు ఆల్రెడీ. ఇక రాబోయే సినిమాలు చూసుకుంటే.. ఓ బేబీ సినిమాలో ఓ కేరెక్టర్ లో చేసిన హీరో తేజ నటించిన జాంబీ రెడ్డి ఫిబ్రవరి 5 న రిలీజ్ కి రెడీ అయ్యింది. తేజకి జంబి రెడ్డి మీద మంచి హోప్స్ ఉన్నాయి. ఇక ఉప్పెన. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ అయ్యి ఎప్పుడో థియేటర్స్ కి రావాల్సిన సినిమా. ఇప్పుడు ఫిబ్రవరి 12 న విడుదలకు సిద్ధమైంది. ఈ ఉప్పెన సినిమాపై మెగా హీరో వైష్ణవ తేజ్ ఫ్యూచర్ డిపెండ్ అయ్యి ఉంది. RX 100 తర్వాత ఎన్ని సినిమాలు చేసినా మళ్ళీ హిట్ రాని హీరో కార్తికేయ. కార్తికేయకి రీసెంట్ గా డేట్ ప్రకటించిన చావు కబురు చల్లగా హిట్ ఇస్తుంది అని నమ్ముతున్నాడు. ఈ సినిమాపై కార్తికేయ మాత్రమే కాదు.. పెద్దగా సక్సెస్ లేని లావణ్య త్రిపాఠి కూడా హోప్స్ పెట్టుకుంది.
ఎప్పటినుండో హిట్ కోసం కొట్టుకులాడిపోతున్న హీరో అది సాయి కుమార్ శశి సినిమాపైనే హోప్స్ పెట్టుకున్నాడు. శశి హిట్ ఆది కు అత్యంత అవసరం కూడా. అలాగే వేంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే ఒకే ఒక్క సక్సెస్ తో ఇంత కెరీర్ నెట్టుకొచ్చిన సందీప్ కిషన్ A1 ఎక్స్ప్రెస్ అంటూ అతనికి కలిసొచ్చిన టైటిల్ తో బరిలోకి దిగుతున్నాడు. ఎన్ని సినిమాలు చేసినా సక్సెస్ అందుకోలేకపోయిన సుశాంత్ కి కెరీర్ లో చి. ల సౌ మాత్రమే హిట్ ఉంది. సుశాంత్ కూడా ఇచ్చట వాహనములు నిలపరాదు తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరోపక్క మళ్ళిరావాతో సక్సెస్ ట్రాక్ ఎక్కినా సుమంత్ కపటధారి తో సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు. ఇక అక్కినేని హీరో అఖిల్ హిట్ కోసం తహతహలాడుతున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు అఖిల్. మరి ఈ యంగ్ హీరోల నిరీక్షణ ఫలించి పరీక్షలో పాసయ్యేనా?