Advertisement
Google Ads BL

999 ఫీట్ పవన్ కి పాజిబుల్ అవ్వుద్దా


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరస సినిమాల లిస్ట్ ఎప్పటికప్పుడు రివీల్ చేస్తూనే ఉన్నాం. ప్రస్తుతం వకీల్ సాబ్ షూటింగ్ ముగించుకుని.. ఏకే రీమేక్ షూటింగ్ లో పాల్గొంటున్నారు పవన్. వకీల్ సాబ్ షూటింగ్ మొదలైన ఏడాదికి ఆ సినిమా రిలీజ్ తే ప్రకటించింది టీం. నిన్నమొన్నటివరకు వకీల్ సాబ్ రిలీజ్ డేట్ విషయంలో కన్ఫ్యూషన్ క్రియేట్ చేసిన దిల్ రాజు ఎట్టకేలకు వకీల్ సాబ్ ని ఏప్రిల్ 9 న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. గత రెండు రోజులుగా అన్ని సినిమాల రిలీజ్ డేట్స్ చూసి దిల్ రాజు ని ఆడుకుంటున్న పవన్ కళ్యాణ్ ఫాన్స్ వకీల్ సాబ్ డేట్ రావడంతో కూల్ అయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ మరో రీమేక్ కూడా తాజాగా హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలయ్యింది. 

Advertisement
CJ Advs

అయితే శేఖర్ కే చంద్ర దర్శకత్వంలో త్రివిక్రమ్ హాండ్స్ లో పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో తెరకెక్కుతున్న ఏకే రీమేక్ ని సెప్టెంబర్ 9 న రిలీజ్ చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే పింక్ రీమేక్ వకీల్ సాబ్ ఏప్రిల్ 9 న విడుదల కాబోతుంటే.. ఏకె రీమేక్ సెప్టెంబర్ 9న విడుదల చేసే ప్లాన్స్ లో టీం ఉంది. ఇక క్రిష్ - పవన్ కాంబోలో  తెరక్కబోయే పియాడికల్ మూవీ ఎప్పుడో మొదలయినా.. ప్రస్తుతం రెండు షడ్యూల్ కంప్లీట్ చేసుకుని.. షూటింగ్ కి కాస్త బ్రేకిచ్చారు. మరి పవన్ క్రిష్ మూవీ వచ్చే ఏడాది అంటే 2022 జనవరి 9 న సంక్రాంతి సందర్భంగా విడుదల చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్లుగా సమాచారం. 

ప్రస్తుతం పవన్ సినిమా నిర్మాతలు అనుకుంటున్న డేట్స్ ఇవి. నిర్మాతలు అనుకుంటున్నట్టుగా ఇంత రాపిడ్ గా పవన్ కళ్యాణ్ స్పీడు స్పీడు గా షూటింగ్స్ పూర్తి చెయ్యగలరా? అనుకున్న డేట్స్ కి పవన్ సినిమాలు అనుకున్నట్లుగా విడుదలవుతాయా? ఈ 999 ఫీట్ ని పవన్ చేస్తాడా? చేయగలడా?..

Is 999 Feet Pawan Possible?:

Pawan Kalyan upcoming Movie Release dates
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs