Advertisement
Google Ads BL

బేబీ రెడీ.. బాబే సెట్ కావట్లేదు


గుణశేఖర్ దర్శకత్వంలో సమంత మెయిన్ లీడ్ లో శాకుంతలం పాన్ ఇండియా ఫిలిం అనౌన్సమెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. శాకుంతలం సినిమా గురించి గుణశేఖర్ తో ఇప్పటికే మూడు సిట్టింగ్స్ అయ్యాయి. కథ విన్న సమంత ఇమ్మిడియట్ గా ఓకె చెప్పడం, కేరెక్టరైజేషన్ గురించి కంప్లీట్ గా వినడం, అంతేకాకుండా కాస్ట్యూమ్స్ అండ్ అప్పీరియన్స్ గురించి డిస్కర్షన్స్ కూడా మొదలైపోయాయి. సమంత తన వంతుగా తాను శాకుంతలం సినిమా కోసం రెడీ అయ్యిపోయింది. కానీ ఈ శకుంతలకు దుశ్యంతుడే దొరకడం లేదు. ఎందుకంటే ఈ సినిమా హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం అని అందరికి ఒక ఫీలింగ్ వచ్చేసింది. గుణశేఖర్ ఏమో శకుంతలంతో పాన్ ఇండియా ఫిలిం చేద్దామనుకుంటున్నారు.

Advertisement
CJ Advs

సో అన్ని లాంగ్వేజెస్ కి సెట్ అయ్యే హీరో అయితే దొరకడం లేదు. శాకుంతలం లో దుశ్యంతుడి లిస్ట్ లో కొంతమంది హీరోలు అయితే ఉన్నారు. కానీ గుణశేఖర్ కి మాత్రం మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మీద కన్ను ఉంది. మహానటి తో తెలుగు, తమిళ భాషలను ఓ ఊపు ఊపిన దుల్కర్ అయితే దుశ్యంతుడిగా బావుంటుంది అని గుణశేఖర్ ఆలోచన. అందుకే గుణశేఖర్ దుల్కర్ సల్మాన్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ టాక్. మరి నిజంగానే శాకుంతలంలో శకుంతలాగా సమంత, దుశ్యంతుడిగా దుల్కర్ సల్మాన్ అయితే.. సినిమా రేంజ్ మారిపోవడం ఖాయమంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

Baby ready, Babu is not set:

Gunasekhar thinks that Dulquer is good as a Dushyanth
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs