రెండు రోజుల నుండి టాలీవుడ్ ఇండస్ట్రీలో రిలీజ్ డేట్స్ జాతర హంగామా గంట గంటకి అందరిలో టెంక్షన్, క్యూరియాసిటీని పెంచేసింది. ఏ డేట్ లో ఏ సినిమా రిలీజ్ అవుతుందో? ఎవరి సినిమాతో ఎవరి సినిమా డేట్ క్లాష్ అవుతుందో? సినిమా సినిమాకి గ్యాప్ ఎంతుందో? అంటూ కేవలం దర్శకనిర్మాతలు కాదు ప్రేక్షకుల్లోనూ పిచ్చ టెంక్షన్ క్రియేట్ అయ్యింది. జనవరి 28 , 29 డేట్స్ టాలీవుడ్ లో ఎప్పటికి గుర్తుండిపోయే తేదీల మాదిరి రిలీజ్ డేట్స్ హంగామా జరిగింది. అయితే పాన్ ఇండియా ఫిలిం దగ్గరనుండి మీడియం బడ్జెట్ మూవీ అలాగే చిన్న సినిమాల డేట్స్ కూడా వదిలారు. కానీ ప్రభాస్, పవన్ కళ్యాణ్ లు ఈ రిలీజ్ డేట్స్ రేసులో వెనుకంజలో ఉన్నారు.
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ పూర్తయ్యి విడుదలకు సిద్దమయినా దిల్ రాజు వకీల్ సాబ్ రిలీజ్ డేట్ ఇవ్వకుండా టెంక్షన్ పెంచేస్తున్నాడు. పవన్ కూడా పెద్దగా పని లేదు మనకెందుకు అన్నట్టుగా ఏకే రీమేక్ షూటింగ్ కి వెళ్ళిపోయాడు. ఇది ఎలాగూ రీమేక్ కనీసం శేఖర్ కే చంద్ర అయినా ఏకే రీమేక్ సినిమా రిలీజ్ డేట్ ఇస్తాడనుకుంటే.. పవన్ తో షూటింగ్ ఇప్పుడే డేట్ ఇవ్వడం కుదరదు అన్నట్టుగా ఉండిపోయాడు. మరోపక్క వకీల్ సాబ్ డేట్ కోసం పవన్ ఫాన్స్ దిల్ రాజు మీద దండెత్తినా పని జరగలేదు. దిల్ రాజు ఏదో 100 పర్సెంట్ ఆక్యుపెన్సీకి స్టిక్ అవడం వలనే డేట్ ఇవ్వలేదని అంటున్నారు. మరి ఇప్పడు పవన్ ఫాన్స్ పవన్ మీద ఒత్తిడి పెంచుతున్నారు. వకీల్ సాబ్ కోసం ఏడాదిగా ఎదురు చేసూతున్నాం కనీసం ఇప్పటికైనా డేట్ ప్రకటించి మమ్మల్ని సంతోష పెట్టండి అంటూ పవన్ కే రిక్వెస్ట్ లు పెడుతున్నారట ఫాన్స్.