Advertisement
Google Ads BL

నారప్ప - ఆచార్య పంచాయితి షురు


సినిమాల డేట్స్ విషయంలో, థియేటర్స్ పంచుకునే విషయంలో ఈ మధ్యన ఇండస్ట్రీలో చాలా పంచాయితీలు జరుగుతున్నాయి. కొన్ని సినిమాల గొడవలు పెద్దలవరకు లేదంటే నిర్మాతల మండలిలో పంచాయితీల వరకు వెళుతున్నాయి. గత ఏడాది రిలీజ్ డేట్స్ విషయంలో మహేష్ - అల్లు అర్జున్ నటించిన సరిలేరు నీకెవ్వరూ - అలా వైకుంఠపురములో మధ్యన పంచాయితీ జరిగి అందులో ఒకరు తాగాల్సి వచ్చింది. తర్వాత కూడా చిన్న సినిమాల దగ్గరనుండి పెద్ద సినిమాల వరకు ఇలాంటి రిలీజ్ డేట్ పంచాయితీలు ఉంటూనే ఉన్నాయి. మరి గత రెండు రోజులుగా రిలీజ్ డేట్స్ జాతర టాలీవుడ్ ని ఊపేస్తోంది. అందులో డేట్స్ క్లాష్ అయిన సినిమాలు పెద్దగా కనిపించలేదు. కానీ మే లో సీనియర్ హీరోలిద్దరూ నువ్వా-నేనా అంటూ పోటీ పడుతున్నారు. 

Advertisement
CJ Advs

అందులో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా అసురన్ రీమేక్ గా తెరకెక్కుతున్న నారప్ప సినిమాని మే 14 రిలీజ్ అంటూ మధ్యాన్నం డేట్ లాక్ చేసి ప్రకటించారు. నారప్ప మే 14 అంటూ డేట్ అనౌన్స్ చేసారు. అయితే అదే రోజు సాయంత్రానికి చిరంజీవి - రామ్ చరణ్ కాంబోలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న మెగా మల్టీస్టారర్ ఆచార్య సినిమా మే 13 రిలీజ్ అంటూ డేట్ వదిలారు. మరి ముందుగా నారప్ప టీం డేట్ ప్రకటించగా.. సాయంత్రానికి కూల్ గా ఆచార్య టీం డేట్ వదిలింది. రెండు రోజుల తేడాతో రెండు పెద్ద సినిమాల రిలీజ్ అంటే థియేటర్స్ విషయంలో రగడ, కలెక్షన్స్ విషయంలో పోటీలు తప్ప మరేమి ఉండదు.

అయితే ఇక్కడ పెద్ద సినిమాలైనా డేట్స్ క్లాష్ అవడంతో నారప్ప - ఆచార్య పంచాయితీ మాత్రం షురు అయ్యేలాగే కనబడుతుంది. నారప్ప రిలీజ్ విషయంలో గొడవలెందుకులే అని సురేష్ బాబు కాస్త తగ్గినా తగ్గొచ్చు. ఎందుకంటే సురేష్ బాబుకి ఇలాంటి రిస్క్ తీసుకోవడం నచ్చదు కనకే నారప్ప డేట్ మారినా మారొచ్చు అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. 

Naarappa - Acharya Release dates clashing :

Venkatesh Naarappa vs Chiru Acharya
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs