Advertisement
Google Ads BL

మెగా ఫ్యామిలీ మెరుపులు మరోసారి.!


మెగా ఫ్యామిలీ గత రెండు నెలలుగా కలిసి చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. చిరు దగ్గరనుండి పవన్ కళ్యణ్ వరకు నిహారిక పెళ్ళిలో పెద్ద హడావిడి చేసి అందరూ చూపు తమవైపే తిప్పేసుకున్నారు. గతంలో మెగా ఫ్యామిలీ లో ఏ ఒక్కరు మిస్ అయినా అది పెద్ద సెన్సేషన్ అయ్యేది. నిహారిక పెళ్ళిలో అల్లు ఫ్యామిలీ కూడా కలిసి బాగా ఎంజాయ్ చేసారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్ గా కనిపించిన నిహారిక పెళ్ళిలో మెగా ఫ్యామిలిలో పిల్లా, పెద్దా అందరూ కలిసే ఎంజాయ్ చేసారు. ఇక ఫ్యామిలిలో అన్నదమ్ములు ఎలా ఉన్నా.. బయట మాత్రం చిరు సినిమాలు, రాజకీయాలు, మళ్ళీ సినిమాలు అంటూ షూటింగ్స్ చేసుకుంటున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ రెండు పడవల ప్రయాణం అంటే రాజకీయాలు, సినిమాలు అంటూ హడావిడిగా తిరుగుతున్నారు. ఇక నాగబాబు కామెడీ షోస్ నుండి బయటికి వచ్చి ఏదో యూట్యూబ్ ఛానల్ అంటూ హంగామా చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

వరుణ్ తేజ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, ఆఖరికి నిహారిక కూడా ఎవరి షూటింగ్స్ తో వారు బిజీగా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏకే రీమేక్ లో పాల్గొంటుంటే చిరు-చరణ్ లు ఆచార్య షూట్ తో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా మెగా మదర్ అదేనండి చిరు గారి అమ్మగారు అంజనా దేవి పుట్టిన రోజుని మెగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కలిసి ఘనంగా చేసారు. అంటే పార్టీ అంటూ హడావిడి ఏం లేకపోయినా.. చిరు - పవన్ - నాగబాబు చిరు చెల్లెళ్ళు కలిసి అమ్మకు ప్రేమతో అంటూ అంజనాదేవి గారితో కేక్ కట్ చేయించారు. అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు కలిసి దిగిన ఆ పిక్ లో వదినగారు సురేఖ కూడా ఉన్నారు. ఇక పవన్ మెగా ఫ్రేమ్ లో ఉంటే ఆ కిక్కే వేరంటున్నారు మెగా ఫాన్స్.  ప్రస్తుతం మెగా మదర్ బర్త్ డే సెలెబ్రేషన్స్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Chiru Mother Anjana Devi Birthday Celebration:

Mega Mother Anjana Devi Birthday Celebration
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs