Advertisement
Google Ads BL

సలార్ షూట్ బిగిన్స్ - నాగ అశ్విన్ అప్ డేట్


సలార్ షూట్ బిగిన్స్ - నాగ అశ్విన్ అప్ డేట్

Advertisement
CJ Advs

ప్రభాస్ పాన్ ఇండియా చిత్రాలు జోరు - హోరు ఓ రేంజ్ లో కనబడుతుంది. రాధాకృష్ణ తో రాధేశ్యామ్ షూటింగ్ ముంచేసుకుని ప్రశాంత్ నీల్ తో సలార్ షూటింగ్ కోసం సింగరేణి వెళ్ళిపోయాడు ప్రభాస్. నేడు సలార్ షూటింగ్ లో పాల్గొనబోతున్న ప్రభాస్ ఇల్లేందు గెస్ట్ హౌస్ లో దిగాడు. ప్రభాస్ రాక తో ఫాన్స్ రచ్చ మాములుగా లేదు. భారీ కాన్వాయ్ తో ప్రభాస్ ఫాన్స్ ప్రభాస్ ని చూడడానికి ఎగబడ్డారు. అయితే ప్రభాస్ అక్కడే రామగుండం  కమిషనరేట్‌కు వచ్చి ఆ ప్రాంత‌ సీపీ సత్యనారాయణను కలిసి ముచ్చటించారు. రామగిరి మండలం సింగరేణి ఓసీపీ-2లో సలార్ కోసం భారీ యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేసాడు ప్రశాంత్ నీల్. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోనే హైలెట్ అనేలా ఉంటుంది అని.. ప్రభాస్ ఎలివేషన్స్ సీన్స్ లో ఈ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి అంటున్నారు. అక్కడే సింగరేణి ఓపెన్ కాస్ట్ లో వేసిన భారీ సెట్ లో ఓ ప‌ది రోజుల పాటు సలార్ షూటింగ్ షెడ్యూల్‌లో జ‌రుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ సలార్ షూటింగ్ కి సమాయత్తమవుతున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఒక్క అప్ డేట్ తోనే ప్రభాస్ ఫాన్స్ ఊగిపోతుంటే ప్రభాస్ మరో దర్శకుడు నాగ్ అశ్విన్.. ప్రభాస్ తో చెయ్యబోయే సినిమాకోసం సినిమాటోగ్రఫేర్ తో పాటుగా మ్యూజిక్ డైరెక్టర్ ని రివీల్ చేస్తూ వైజయంతి మూవీస్ బిగ్ అప్ డేట్ ఇచ్చింది. నాగ్ అశ్విన్ చెప్పినట్టుగా జనవరి 29 న ప్రభాస్ సినిమా అప్ డేట్ ఉండబోతుంది అన్నట్టుగా ప్రభాస్ సినిమాకి పని చెయ్యబోయే సినిమాటోగ్రఫేర్ దని శాంచెజ్లో పెజ్ పని చేయబోతున్నారని అలాగే ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో కి మ్యూజిక్ డైరెక్టర్ గా మిక్కీ జె మేయర్ ని ఎంపిక చేసినట్టుగా ప్రకటించారు. మరి ప్రభాస్ ఫాన్స్ కి సలార్ షూటింగ్ బిగినింగ్ అప్ డేట్ తో పాటుగా.. నాగ శ్విన్ సినిమా అప్ డేట్ రావడంతో పట్టలేని ఆనందంతో పండగ చేసుకుంటున్నారు. 

Salaar Shoot begins - Nag Ashwin Movie updates:

Prabhas pan India Movies Big updates
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs