Advertisement
Google Ads BL

ఖిలాడీకి క్యాస్టింగ్ ప్లస్సా.. మైనస్సా?


క్రాక్ హిట్ తో జోరు మీదున్న రవితేజ.. బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తెచ్చిన ఉత్సాహంతో ఖిలాడీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. రవితేజ పుట్టిన రోజునాడు ఖిలాడీ గ్లిమ్బ్స్ తో  అదరగొట్టేసాడు. శరవేగంగా ఖిలాడీ షూటింగ్ జరుగుతుంది. వీరా లాంటి ప్లాప్ సినిమా ఇచ్చిన రమేష్ వర్మ ని మళ్లీ నమ్మి రవితేజ ఖిలాడీ సినిమా చేస్తున్నాడు. ఈసారైనా హిట్ కొట్టాలనే కసితో పని చేస్తున్నాడు రమేష్ వర్మ. ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన విషయం ఏమిటి అంటే.. ఖిలాడీ సినిమాలో భారీ క్యాస్టింగ్ గురించి. రవితేజతో ఇద్దరు హీరోయిన్స్ జోడి కడుతున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి తో పాటు అనసూయ ఓ కీ రోల్ ప్లే చేస్తుంది.

Advertisement
CJ Advs

వారితో పాటుగా సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ , తమిళ హీరో శరత్ కుమార్, వెన్నెల కిషోర్ లాంటి పెద్ద ఆర్టిస్ట్ లతో చాలా పెద్ద తారాగణం ఉంది ఈ సినిమాలో. అయితే ఇక్కడ నెగెటివ్ గా అనిపించే విషయం ఏమిటి అంటే.. యాక్షన్ కింగ్ అర్జున్ కేరెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత టాలీవుడ్ లో అర్జున్ నటించిన సినిమాలన్నీ డిజాస్టర్స్. శ్రీ ఆంజనేయం, హరే రామ హరే కృష్ణ, లై, నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా అన్ని డిజాస్టర్స్ సినిమాలే. అది ఒక నెగెటివ్ అనుకుంటే.. నా పేరు సూర్య సినిమాలో ఇదే అర్జున్, ఇదే శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఆ సీనియర్ తమిళ హీరోలిద్దరూ.. ఖిలాడీలో.. కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి క్రాక్ హీరో ఆ నెగెటివ్ సెంటిమెంట్ ని క్రాస్ చేస్తాడా? లేక మళ్ళీ మన తెలుగు సినిమా పరిశ్రమ బలంగా నమ్మే ఆ నెగెటివిటీనే దెబ్బతీస్తుందా?  ఖిలాడీకి క్యాస్టింగ్ ప్లస్సా? మైనస్సా? అనేది ఖిలాడీ రిలీజ్ అయ్యేవరకు వెయిట్ చేసి చూడాలి. 

Casting plus or minus for Khiladi?:

Can Ravi Teja Cross the Negative Sentiment
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs