Advertisement
Google Ads BL

ఫ్యాషన్ ఐకాన్ ఆఫ్ టాలీవుడ్


రోజు రొజుకీ క్రేజీ లుక్స్ తో కిక్కిస్తోంది అక్కినేని సమంత. పెళ్లి తర్వాత క్రేజీ ఆఫర్స్ తో పాన్ ఇండియానే చుట్టెయ్యడానికి రెడీ అయ్యింది. ఈ మధ్యనే సమంత కి ఓ బేబీ ని కేరెక్టర్ తో పాటుగా ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సీరీస్ లో తాను చేసిన ఛాలెంజింగ్ రోల్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పింది. ఇక రీసెంట్ గా ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టిన సమంత తన బ్రాండ్స్ ని పబ్లిసిటీ చెయ్యడం కోసమే ఫ్యాషన్ ఐకాన్ గా మారలేదు. ఎందుకంటే ఎప్పటినుండో సమంత ఫ్యాషన్ ఐకాన్ ఆఫ్ టాలీవుడ్డే . చేనేతే రంగానికి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసిన సమంత చేనేతే చీరల్లో మెరిసిపోయేది. అలాగే టాలీవుడ్ ఈవెంట్స్ లోను ఫ్యాషన్ గా రెడీ అయ్యి అందరి అటెంక్షన్ తన మీదే ఉండేలా ప్లాన్ చేసేది సమంత. సాకి ఫ్యాషన్ బ్రాండ్స్ కోసం సమంత లేటెస్ట్ గా ఫోటో షూట్స్ తో పడేస్తుంది. 

Advertisement
CJ Advs

పెళ్లి అయినా బిజీగానే ఉంటున్న సమంత ఫ్యాషన్ ఐకాన్ ఆఫ్ టాలీవుడ్ అనడంలో ఎలాంటి సందేహము లేదు. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం పాన్ ఇండియా ఫిలిం లో నటించబోతున్న సమంత.. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ఫ్యామిలీ మ్యాన్ ప్రమోషన్స్ ముగించుకుని ముంబై నుండి హైదరాబాద్ కి చేరుకున్న సమంత ప్రస్తుతం శాకుంతలం లుక్ టెస్ట్ లో పాల్గొంటుంది. అంతేకాకుండా సాకి ఫ్యాషన్ బ్రాండ్స్ ఫోటో షూట్స్ తోనూ అదరగొట్టేస్తుంది. ఎప్పటికప్పుడు తన కొత్త గ్లామరస్ ఫొటోస్ ని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ అభిమానులకి కిక్కిచ్చే సమంత తాజాగా పోస్ట్ చేసిన ఫోటో చూస్తే ఫ్యాషన్ ఐకాన్ ఆఫ్ టాలీవుడ్ అంటారు. అంత చక్కటి క్రేజీ లుక్స్ తో అదరగొట్టేస్తుంది సామ్.

Fashion Icon of Tollywood:

Samantha Akkineni Looks Breathtaking
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs