Advertisement
Google Ads BL

ప్రభాస్ మీద అభిమానుల చిందులు


జనవరి 28న చిన్న సినిమాల దగ్గరనుండి పాన్ ఇండియా మూవీస్ వరకు తమ తమ రిలీజ్ డేట్స్ ని ప్రకటించి ఫాన్స్ కి హ్యాపీనెస్ ని ఇచ్చాయి. అస్సలు రేసులో లేదు అనుకుంటున్న అల్లు అర్జున్ పుష్ప సినిమా రిలీజ్ డేట్ ఇచ్చి ఫాన్స్ ని ఖుష్ చేసిన టీం మిగతా అందరికి షాకిచ్చారు. ఇక అల్లు అర్జున్ ఫాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మొన్నటికి మొన్న RRR రిలీజ్ డేట్ ఇచ్చేసింది టీం. నిన్నగాక మొన్న షూటింగ్ మొదలు పెట్టుకున్న ఎఫ్ 3 కూడా రేసులోకి వచ్చేసింది. మరోపక్క పాన్ ఇండియా ఫిలిం కెజిఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ డేట్ ఎనౌన్సమెంట్ అంటూ ఈ రోజు సాయంత్రానికి టైం ఫిక్స్ చేసింది కెజిఎఫ్ టీం. ఇలా వరసబెట్టి తమ సినిమాల రిలీజ్ డేట్స్ ని వదులుతున్న దర్శకనిర్మాతలను చూసిన ప్రభాస్ ఫాన్స్ కి మండిపోతుంది. 

Advertisement
CJ Advs

ఎందుకంటే ప్రభాస్ - రాధాకృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ అప్ డేట్ ఇంతవరకు లేదు. ఆసలు ప్రభాస్ సినిమాల మీద సినిమాలు లైన్ లో పెట్టడమే కానీ.. పబ్లిసిటీ విషయాల్లో వీక్ అవడం వలనే సినిమాలకు దెబ్బ పడుతుంది అని ఫీలైపోతున్నారు. సాహో విషయంలోనూ ఇంతే చేసారు. రిలీజ్ డేట్ ఇవ్వకుండా పబ్లిసిటీ కార్యక్రమాలను తూతూ మంత్రంగా చేసి సాహో కి దెబ్బేసారు. ఇప్పుడు రాధేశ్యాం విషయంలో అంతే. రిలీజ్ డేట్ ప్రకటించలేదు. షూటింగ్ అప్ డేట్ లేదు. ఓ టీజర్ లేదు. అంటూ ఫాన్స్ ప్రభాస్ పై చిందులు తొక్కుతున్నారు. రాధేశ్యాం విషయంలో దర్శకనిర్మాతలు చేసే పని ప్రభాస్ ఫాన్స్ కి మింగుడు పడడం లేదు. 

మరోపక్క ప్రభాస్ రాధేశ్యామ్ విషయం పట్టించుకోకుండా సలార్ సలార్ అంటున్నారు. ప్రశాంత్ నీల్ కాంబోలో ప్రభాస్ చెయ్యబోతున్న సలార్ రెగ్యులర్ షూటింగ్ ఈ శుక్రవారం నుండి మొదలు కాబోతున్నట్టుగా ఫిలిం నగర్ టాక్.  అది ఓకె. కానీ రాధేశ్యామ్ విషయం తేల్చమంటున్నారు ప్రభాస్ ఫాన్స్. పాన్ ఇండియా ఫిలిం పబ్లిసిటీ అంటే ఎలా ఉండాలి. రిలీజ్ డేట్ విషయంలో ఎంత పక్కాగా ఉండాలి కానీ రాధాకృష్ణకు చీమకుట్టినట్టుగా కూడా లేదు అంటున్నారు ఫాన్స్.

Fans firing on Prabhas:

Prabhas Radhe Shyam release date no update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs