Advertisement
Google Ads BL

జనవరి 28 చాలా స్పెషల్ డేట్ తెలుసా


అయిపోయిన డేట్ చూసి ఆ డేట్ లో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా.. చాలా సినిమాల రిలీజ్ డేట్ లని బట్టబయలు చేసేసిన డేట్ ఇది. ఒకేసారి పొలోమని అన్ని రిలీజ్ డేట్స్ పోటీ పడి మరీ కన్ఫర్మ్ చేసుకున్న రోజు ఇది. ముందుగా అల్లు అర్జున్ - సుకుమార్ పాన్ ఇండియా ఫిలిం పుష్ప రిలీజ్ డేట్ తో ఈ రోజు సోషల్ మీడియాలో హడావిడి మొదలయ్యింది. ఎలాంటి ఇంఫార్మేషన్ లేకుండానే అల్లు అర్జున్ పుష్ప రిలీజ్ డేట్ ఆగష్టు 13 ఐదు భాషల్లో రిలీజ్ అవుతుంది అంటూ ప్రకటించి అందరికి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆ వెంటనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించబోతున్న గని సినిమాని జులై 30 న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత చాలా సినిమాల డేట్స్ ని ఈవెనింగ్ వరకు రివీల్ చేస్తూనే ఉన్నారు దర్శకనిర్మాతలు.

Advertisement
CJ Advs

అందులో గోపీచంద్ - సంపత్ నందిల సీటిమార్ ఒకటి. వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఏప్రిల్‌2న ఎగ్రెసివ్ స్టార్ గోపిచంద్ - మాస్ డైరెక్టర్ సంప‌త్‌నందిల సీటీమార్ అంటూ డేట్ ప్రకటించారు. ఆ తర్వాత రానా - సాయి పల్లవి కాంబోలో వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాట పర్వం రిలీజ్ డేట్ వచ్చేసింది. విరాట‌ప‌ర్వం ఏప్రిల్ 30 విడుద‌ల అంటూ దర్శకనిర్మాతలు పోస్టర్స్ రిలీజ్ చేసి మరీ డేట్ ఫిక్స్ చేసారు. సాయంత్రం అయ్యేసరికి ఎలాంటి హంగామా లేకుండా F3 టీం రంగంలోకి దిగేసింది. ఈమధ్యనే షూటింగ్ మొదలు పెట్టుకుని నిర్విరామంగా చిత్రీకరణ జరుపుకుంటున్న వెంకటేష్ - వరుణ్ తేజ్ - అనిల్ రావిపూడి నవ్వుల హంగామా F3 ఆగష్టు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అంటూ ప్రకటించడంతో ఈ రోజు విడుదల డేట్స్ హంగామా పూర్తయ్యింది. 

ఎన్నడూ లేని విధంగా ఈ జనవరి 28 నే బోలెడన్ని సినిమా రిలీజ్ డేట్స్ అనౌన్సమెంట్ రావడంతో.. ఈ డేట్ సినిమా ఇండస్ట్రీకి ఎప్పటికీ స్పెషల్ డేట్ గానే ఉండబోతుంది.

January 28th is a very special date:

With the announcement of many movie release dates on January 28, this date is going to be a special date for the film industry forever.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs