బాలీవుడ్ లో రీసెంట్ గా పెళ్లి పీటలెక్కిన వరుణ్ ధావన్ పెళ్లి అంగరంగ వైభవంగా కొద్దిమంది సన్నిహితుల మధ్యన జరిగిన విషయం తెలిసిందే. నటాషాని వివాహం చేసుకున్న వరుణ్ ధావన్ పై ఇప్పుడో సౌత్ హీరోయిన్ హాట్ కామెంట్స్ చేస్తుంది. వరుణ్ ధావన్ - నటాషా పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూనే వరుణ్ ధావన్ పై సెటైర్స్ వేసింది శ్రద్ధ శ్రీనాధ్. బాలీవుడ్ లో మరో మంచి నటుడు పెళ్లి అనే ఊబిలోకి దిగడంతో.. ఇకపై వరుణ్ ధావన్ ని సినిమాల్లో ఎక్కువగా చూడలేమేమో అంటూ హాట్ హాట్ వ్యాఖ్యలు చేసింది.
ఎందుకంటే వరుణ్ ధావన్ సినిమాల్లో హీరోయిన్స్ తో రొమాంటిక్ సీన్స్ చేసినా, అలాగే హీరోయిన్స్ తో క్లోజ్ గా ఉన్నా వరుణ్ భార్య నటాషా కానీ ఆమె తలితండ్రులు కానీ ఒప్పుకోకపోవచ్చు అంటూ.. సంచలనంగా మాట్లాడడమే కాదు వరుణ్ ధావన్ హీరోయిన్ లేని.. హీరో ఓరియెంటెడ్ మూవీస్ మాత్రమే చేస్తాడా? అంటూ వరుణ్ భార్య నటాషాకు వరుణ్ మీద అనుమానం ఉంటుంది అనే అర్ధం వచ్చేలా మాట్లాడి అందరిలో అనుమానాలు క్రియేట్ చేసింది. పెళ్లి పేరుతొ వరుణ్ ధావన్ కెరీర్ ని, పర్సనల్ లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తాడో అంటూ మాట్లాడిన శ్రద్ద శ్రీనాధ్ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరాలవుతున్నాయి.