Advertisement
Google Ads BL

విమర్శలు చేసారా? మనం టాప్ లో ఉన్నట్టే


పెళ్లి తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకే మొగ్గు చూపుతున్న సమంత సదరు హీరో కమర్షియల్ చిత్రాలకు బ్రేకిచ్చేసింది. పెళ్లి తర్వాత గ్లామర్ ఆరబోస్తూ హడావిడి చేసే సమంతకి బోలెడన్ని ఆఫర్స్ ఉన్నా ఆమె మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తుంది. రీసెంట్ గా తెలుగులో శాకుంతలం పాన్ ఇండియా మూవీకి సైన్ చేసిన సమంత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ తోనే ఇండియా వైడ్ ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. అమెజాన్ లో ఫిబ్రవరి 12 న విడుదల కానున్న ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ కోసం అందరూ ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే 2020 అందరికి కరోనా తో కాలం కష్టంగానే గడిచింది. ఎప్పుడెప్పుడు 20 ని దాటి 21 లోకి అడుగుపెడతామా అన్నట్టుగా ఉన్నారు.

Advertisement
CJ Advs

అయితే అంత గడ్డు కాలంలో సమంత బెస్ట్ మెమొరీ ఏమిటి అనగానే రానా పెళ్లి ఫోటో పోస్ట్ చేసి తనకి 2020 లో బెస్ట్ మెమొరీ రానా పెళ్లి అంటూ చెప్పకనే చెప్పింది. దగ్గుబాటి ఫ్యామిలీతో పాటుగా చైతు - సమంత ఉన్న ఆ ఫోటో సమంత 2020 లో బెస్ట్ అంటుంది. ఇక గాసిప్స్ వచ్చినప్పుడు, ట్రోలింగ్ చేసినప్పుడు.. గతంలో అయితే చాలా బాధపడేదాన్ని. ఆ విషయంలో నిద్రలేని రాత్రులు కూడా గడిపాను. కానీ ఇప్పుడు మాత్రం అవన్నీ ఆలోచిస్తే సిల్లీగా నవ్వొస్తుంది. మనల్ని విమర్శిస్తున్నారు అంతే.. మనం ఎంతో ఎత్తుకు ఎదిగామని అర్ధం అంటూ ఫిలాసఫీ మాట్లాడుతుంది సమంత. ఇక తనకు 20 ఏళ్ళున్నప్పుడు ఇంకా ఇంకా ఎదగాలనే తాపత్రయం ఉండేదంటూ చెప్పుకొచ్చింది సమంత.

Samantha’s 2020 Best Memory:

Samantha shared Rana Daggubati and Miheeka Bajaj’s wedding picture
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs