Advertisement
Google Ads BL

సంక్రాంతిని టార్గెట్ చేస్తున్న సలార్


ప్రభాస్ పాన్ ఇండియా సినిమాల జోరు హోరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ ట్రేండింగ్ లో ఉంటున్నాయి. కరోనా తో వన్ ఇయర్ వెస్ట్ అయినా ప్రభాస్ మాత్రం వరస పాన్ ఇండియా మూవీస్ తో పిచ్చెక్కిస్తున్నాడు. రాధాకృష్ణ తో రాధేశ్యాం సినిమా ఇంకా షూటింగ్ ముగియకముందే ప్రశాంత్ నీల్ తో సలార్ మొదలు పెట్టేసాడు. ప్రభాస్ పర్ఫెక్ట్ గా సహకరిస్తే ఆరు నెల్లో సలార్ ప్రాజెక్టు చక్కబెడతానంటూ ప్రశాంత్ నీల్ ప్రభాస్ కి ఎప్పుడో మాటిచ్చేసాడు. మరి నిజంగా మధ్యలో ఆదిపురుష్, నాగ అశ్విన్ మూవీస్ లేకపోతే సలార్ చాలా ఫాస్ట్ గానే విడుదలకు సిద్ధమయ్యేది కానీ మరో రెండు సినిమా షూటింగ్స్ తో పాటుగా సలార్ షూట్ పారలాల్ గా చెయ్యాల్సి ఉంది.

Advertisement
CJ Advs

అందుకే సలార్ కి వచ్చే ఏడాది సంక్రాంతి కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేయబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంటే ఈ సంక్రాంతి కనుమ రోజున మొదలైన సలార్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి అంటే 2022 లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందనేది  ఆ న్యూస్ సారాంశం అన్నమాట. కెజిఎఫ్ రిలీజ్ అవ్వగానే ప్రశాంత్ నీల్ - ప్రభాస్ సలార్ రెగ్యులర్ షూట్ మొదలు కాబోతుంది అని.. ఒక్కసారి షూటింగ్ మొదలు పెట్టక షూటింగ్ ని పరిగెత్తించి పక్కా ప్లానింగ్ తోనే సలార్ విడుదలకు ప్రశాంత్ నీల్ ఏర్పాట్లు ఉండబోతున్నాయని అంటున్నారు.

Salaar targeting Sankranti 2022?:

Prabhas - Prashanth neel salaar targets in Sankranti 2022
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs