కొరటాల నాన్చుడు యవ్వారానికి చిరు ఎప్పటికప్పుడు షాక్ లు ఇస్తూనే ఉన్నారు. ఆచార్య సినిమా టైటిల్ విషయంలో కొరటాల అధికారిక ప్రకటన లెట్ చెయ్యడంతో.. ఆచార్య టైటిల్ ని ఓ సినిమా ఈవెంట్ లో లీక్ చేసి షాక్ ఇచ్చారు చిరు. ఇక తాజాగా ఆచార్య టీజర్ కోసం మెగా ఫాన్స్ మాత్రమే కాదు.. చిరు కూడా ఎంతగా వెయిట్ చేస్తున్నారో.. పైన పిక్ చూస్తే తెలుస్తుంది. ఆచార్య అప్ డేట్ 6. 30 కి అంటూ చిరు ట్వీట్ చెయ్యగానే మెగా ఫాన్స్ అలర్ట్ అయ్యారు. కొద్దిసేపట్లో మెగా ఆచార్య నుండి అప్ డేట్ కోసం ఎదురు చూస్తుంటే.. ఇంతలోపులో చిరు కొరటాలని బెదిరిస్తున్న పిక్ ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది చిరంజీవి కొరటాలని కూర్చోబెట్టి..
చిరంజీవి: ఏమయ్యా కొరటాల ఆచార్య టీజర్ న్యూ ఇయర్ కి లేదు, సంక్రాంతి కి లేదు.. ఇంకెప్పుడయ్యా అనగానే..
కొరటాల: సర్ అదే పనిలో ఉన్నా
చిరు: టీజర్ ఎప్పుడో చెప్పకపోతే లీక్ చేయడానికి రెడీగా ఉన్నా
కొరటాల: రేపు మార్నింగ్ ఏ ఎనౌన్సమెంట్ చేస్తా సర్
చిరు: ఇస్తావ్ గా
కొరటాల రేపు మార్నింగ్ 10 గంటలకి ఫిక్స్ సర్ పక్కా అంటూ కొరటాల భయపడడం చూస్తే చిరు కొరటాలని బాగా భయపెట్టినట్టుగా కనిపిస్తుంది.
లేదంటే రిపబ్లిక్ డే రోజున ఆచార్య టీజర్ ఎనౌన్సమెంట్ కోసం ఎదురు చూస్తున్న ఫాన్స్ కి కొరటాల షాకిద్దామనుకుంటే ఇప్పుడు ఏకంగా చిరునే కొరటాలకు టీజర్ లీక్ చేస్తా అంటూ వార్నింగ్ ఇవ్వడం మాత్రం ఫన్నీగా అనిపిస్తుంది.