Advertisement
Google Ads BL

షూటింగ్ మొదలయ్యింది.. ట్రీట్ ఇచ్చేసారు


పవన్ కళ్యాణ్ వరస సినిమాల హడావిడి మాములుగా లేదు. వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసేసిన పవన్ క్రిష్ షూటింగ్ లో దూకేశారు. మధ్యలో ఏపీ రాజకీయాలు. క్రిష్ సినిమా షూటింగ్ కి కొంత బ్రేకిచ్చి రీసెంట్ గా అంటే నిన్న శేఖర్ కే చంద్ర దర్శకత్వంలో అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ కి రెడీ అయ్యారు. రానా - పవన్ కళ్యాణ్ కాంబోలో తెరకెక్కనున్న ఏకే రీమేక్ షూటింగ్ చిత్రీకరణ హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. మరి నిన్నే షూటింగ్ మొదలు పెట్టుకున్న ఏకే రీమేక్ లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ కాప్ గా కనిపించబోతున్నాడంటూ బులెట్ పై పవన్ లుక్ ని అలాగే ఏకే రీమేక్ సెట్స్ వీడియో ని రిలీజ్ చేసారు ఏకే రీమేక్ టీం.

Advertisement
CJ Advs

ఏకే రీమేక్ లో పవన్ న్యూ లుక్ లో కనిపిస్తాడు అనుకున్న వారికీ షాకిస్తూ పవన్ నార్మల్ లుక్ తోనే ఏకే షూట్ లో పాల్గొంటున్నాడు. అంటే అయ్యప్పన్ కోషియం రీమేక్ పవన్ క్రేజ్ కి, పవన్ స్టామినాకి, పవన్ లుక్ కి సరిపోయేలా భారీ మార్పులే చేశారనిపిస్తుంది. అందుకే త్రివిక్రమ్ ని పవన్ రంగంలోకి దింపి ఏకే రీమేక్ లో పవన్ పవర్ ఫుల్ నెస్ చూపించేలా ప్లాన్ చేసి డైలాగ్స్ లో మార్పులు, ఇంకా చాలా విషయాల్లో చేర్పులు చేసి ఇది మొత్తం పవన్ పవరిజానికి అనుగుణంగా మార్చేసి ఫాన్స్ కి ట్రీట్ ఇవ్వబోతున్నారనేది తెలిసిపోతుంది. మరి నిజంగా ఎప్పటినుండో షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలే తమ లుక్స్ ని రివీల్ చేసే విషయంలో తర్జన భర్జన పడుతుంటే.. నిన్న మొదలైన షూటింగ్ నుండి అప్పుడే ఫాన్స్ కి ట్రీట్ ఇవ్వడం నిజంగా పవన్ ఫాన్స్ అదృష్టం అని చెప్పాలి.

Power Storm: Pawan Kalyan AK Remake Video:

Goosebumps Alert: Pawan Kalyan Entry On Bullet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs