కరోనా వచ్చింది కకావికలం చేసింది. అందరిని కంగారు పెట్టించింది. ఆల్మోస్ట్ ఒక కేలెండర్ మన లైఫ్ లో లేకుండా పోయింది. కానీ ఈ ఎఫెక్ట్ ఒక రకంగా చెడు చేస్తే.. మరో రకంగా మంచి చేసింది. కాన్సప్ట్ బేస్డ్ ఫిలిమ్స్ కి ఊతమిచ్చింది. ఓటిటి, ఏటిటి ఇవన్నీపెరిగినాయి. వెబ్ సీరీస్ కి ఆదరణ తగ్గింది. కొత్త కొత్త కాన్సెప్ట్స్ వస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే.. ముందు మన హీరోల్లో కదలిక వచ్చింది. ఏదో తాపీగా ఏడాదికి.. రెండేళ్ళకి ఒక సినిమా చేసుకునే హీరోలంతా ఒక్కసారిగా కంటిన్యూస్ సినిమా లైనప్ పెట్టుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి దగ్గరనుండి తీసుకుంటే చిరంజీవికి నాలుగు సినిమాల లైనప్. ఆచార్య, లూసిఫెర్ రీమేక్, వేదాళం రీమేక్, బాబీ సినిమా. ఇక పవన్ కళ్యాణ్ ఐదు సినిమాల లైనప్. అందులో వకీల్ సాబ్, క్రిష్ మూవీ, ఏకే రీమేక్, హరీష్, సురేందర్ రెడ్డి ఫిలిమ్స్.
ఎన్టీఆర్ రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. అల్లు అర్జున్ పుష్ప, కొరటాలతో మరో సినిమా, రెండు మూవీస్. మహేష్ రెండు మూవీస్, ప్రభాస్ ఏకంగా నాలుగు పాన్ ఇండియా ఫిలిమ్స్. మొత్తం అందరు హీరోలు కంటిన్యూస్ గా వరసగా సినిమాలు లైనప్ పెట్టుకుంటున్నారు. అందరిలో కదలిక వచ్చింది. కష్టపడి పని చేసుకోవాలనే తత్త్వం వచ్చింది. ఏజు, గేజూ రెండు కాపాడుకోవాలనుకుంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు వడివడిగా సినిమాలు చెయ్యాలనే ఆలోచన మన హీరోలందరికీ కలగడం, ఇలా ఇన్ని సినిమాలు అనౌన్స్ అవడం, అన్ని ప్రొడక్షన్ లో ఉండడం ఇండస్ట్రీకి శుభ సూచకం అనేలా ఉంది.