కొన్నేళ్ల క్రితం తమిళంలో ధనుష్ - శృతి హాసన్ జంటగా నటించిన 3 సినిమాలో వై థిస్ కొలవెరి కొలవరి ఢీ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో.. ఎంత పెద్ద పాపులర్ అయ్యిందో.. యూట్యూబ్ లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికి తెలుసు. కానీ సినిమా వచ్చేసరికి 3 సినిమా ఎంత పెద్ద డిస్పాయింట్ చేసిందో చూసాం. అలాగే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా ఎప్పుడో కరోనాకి ముందు రిలీజ్ అవ్వాల్సిన సినిమా. లాక్ డౌన్ కరోనా ఎఫక్టో గాని ఆ సినిమాలో నీలి నీలి ఆకాశం పాట మెలోడీస్ గా పెద్ద సెన్సేషన్ అయ్యింది.
అనూప్ రూబెన్స్ అందించిన నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్న సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తూ.. 220 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి ఆ సాంగ్ కి తగిన రిజల్ట్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాకి దక్కితే చాలు. ప్రదీప్ మాచి రాజు, అమృత అయ్యర్ జంటగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా జనవరి 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సాంగ్ పెద్ద హిట్ అయినట్టుగా సినిమాకి కూడా అంతే హిట్ దక్కితే చాలు మరో కొలవెరి ఢీ కాకుంటే చాలు.