Advertisement
Google Ads BL

రాజమౌళి దెబ్బకి హాలీవుడ్ హడల్


రీసెంట్ గా సోషల్ మీడియాలో రాజమౌళి - మహేష్ కాంబోపై ఏవేవో న్యూస్ లు చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి అవన్ని అవాస్తవాలు. రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు ఛత్రపతి శివాజీ సినిమా చెయ్యబోతున్నాడు.. అంటూ చాలా న్యూస్ లే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కానీ అవన్నీ జస్ట్ రూమర్స్ మాత్రమే. రాజమౌళికంటూ ఓ పర్సనల్ విజన్ ఉంది. రాజమౌళి చేసుకుంటూ వచ్చిన సినిమాలు చూస్తే అదే అర్ధమవుతుంది. చక్కటి చందమామ లాంటి కథని బాహుబలి రేంజ్ లో తెరకెక్కించిన రాజమౌళి.. హిస్టరీలో లేని హిస్టరీని ఆర్ ఆర్ ఆర్ తోక్రియేట్ చెయ్యబోతున్నారు. తన డ్రీమ్స్ ని తన డిజైన్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే తపన రాజమౌళిలో ఎంతుంటుందో మనం చూస్తూనే ఉన్నాం.

Advertisement
CJ Advs

రాజమౌళి నెక్స్ట్ స్టెప్ ఏమిటి అంటే.. జేమ్స్ బాండ్. జేమ్స్ బాండ్ చెయ్యాలనేది రాజమౌళి డ్రీం. దానికి రాజమౌళి హీరోగా ఫిక్స్ అయ్యింది మహేష్ బాబుని. నిజానికి ఆంధ్ర జేమ్స్ బాండ్ ఎవరు అంటే సూపర్ స్టార్ కృష్ణ. ఆయన ఆ రోజుల్లోనే జేమ్స్ బాండ్ సినిమాలు చేసి పెద్ద పెద్ద హిట్స్ కొట్టారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ట్రై చేసారు కానీ.. ఆ రేంజ్ హిట్స్ కొట్టి అంతగా సక్సెస్ కాలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ కరెక్ట్ గా జేమ్స్ బాండ్ సినిమా చెయ్యబోతున్నారు రాజమౌళి. దర్శకుల్లో తనకి సమఉజ్జి అనిపించుకునే శంకర్ టిపికల్ గా ఉండే అడ్వాంటేజెస్ ని అన్ని వాడుకుంటూ రోబో, రోబో 2 వంటి సినిమాలు చేస్తుంటే.. హిస్టారికల్ మాన్యుమెంట్స్ అంటే  రాజ్యాలు, యుద్దాలు అనే దాని మీద వెళ్లి బాహుబలి లాంటి సినిమా చేసిన రాజమౌళి.. ఎట్ ఏ టైం.. ఒక మోడ్రెన్ ఫిలిం విత్ టెక్నీకల్ వాల్యూస్, తన విజన్ అన్ని కలిపి కొట్టబోతున్నారు.

ఆర్ ఆర్ ఆర్ తర్వాత రాజమౌళి చెయ్యబోయే సినిమా ఈసారి మాములుగా ఉండదు అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాకి ఇంత బడ్జెట్ అనే లెక్క లేదు. అంటే బడ్జెట్ లెస్ అన్నమాట. బడ్జెట్ లిమిట్ లేకుండా హాలీవుడ్ రేంజ్ లో మహేష్ - రాజమౌళి సినిమా ఉండబోతుంది.

Hollywood to be blown by Rajamouli:

Mahesh babu to play a character like James bond under Rajamouli
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs