ఎప్పుడెప్పుడా.. ఎప్పుడెప్పుడా అని నందమూరి వంశాభిమానులందరూ వేచి చూస్తున్న తరుణం రానే వచ్చింది. బాలయ్య బాబు వంశోద్ధారకుడు, నందమూరి వంశోద్ధారకుడు, బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కి రంగం సిద్ధం అయ్యింది. జూన్ 10 న అంటే బాలయ్య బాబు పుట్టిన రోజునాడు మోక్షజ్ఞ సినిమా లాంచ్ కాబోతుంది. విశేషం ఏమిటి అంటే ఆల్రెడీ విజయ్ దేవరకొండ తో లైగర్ పాన్ ఇండియా ఫిలిం చేస్తున్న పూరి జగన్నాధ్ ఈ సినిమాని కూడా టేకప్ చేస్తున్నాడు. ఫస్ట్ సినిమానే పాన్ ఇండియా సినిమా లాగా తెరకెక్కించబోతున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ ఫస్ట్ సినిమాతోనే పాన్ ఇండియా ఫిలింతోనే రాబోతుంది. ఆల్ లాంగ్వేజెస్ లో మోక్షజ్ఞ ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నాడు.
చిరు తనయుడు రామ్ చరణ్ ని చిరుత సినిమాతో గ్రాండ్ గా లాంచ్ చేసిన పూరి జగన్నాధ్ బాలయ్య వంశోద్ధారకుడిని కూడా ఓ రేంజ్ లో గ్రాండ్ గా ఇంట్రడ్యూస్ చెయ్యబోతున్నాడు. ఈ మేరకు పూరి చెప్పిన కథ, కాన్సెప్ట్ బాలయ్య బాబుకి బాగా నచ్చే.. పైసా వసూల్ కి అనుకున్న రిజెల్ట్ రాకపోయినా.. పూరితో ఉన్న పర్సనల్ రిలేషన్, పూరి మీదున్న నమ్మకంతోనే బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞని పూరి జగన్నాధ్ చేతుల్లోనే పెడుతున్నాడు. ఎప్పటినుండో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం కాచుకుని కూర్చున్న నందమూరి ఫాన్స్ కి మోక్షజ్ఞ ఇలా పాన్ ఇండియా లెవల్లో వెండితెరకు లాంచ్ అవడం అనేది పండగ లాంటి వార్తే.